Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Crime News : అన్నా అని పిలుస్తున్నా… వావీ వరసలు మర్చిపోయి యువతిపై అత్యాచారం చేసిన యువకుడు !

Crime News : మహిళలు, యువతులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం కొత్తగా ఎన్ని చట్టాలు చేస్తున్నా… కొందరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. విచక్షణ కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావీ వరసలు మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకు చిక్కి భవిష్యత్ ను అంధకారంలో పడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఓ ఘటన విస్తుపరుస్తోంది.

ఓ యువతి తనతో సరదాగా మాట్లాడుతుండటాన్ని ఆ యువకుడు అవకాశంగా మలుచుకున్నాడు. అన్నయ్యా అని పిలుస్తున్నా తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పరువు పోతుందని భావించిన యువతి.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దీనిని ఆసరాగా తీసుకున్న ఆ ప్రబుద్ధుడు మరోసారి అఘాయిత్యం చేశాడు. ఈ సారి ఆమె ఊరుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజస్థాన్‌లోని ధోలాపూర్‌కు చెందిన ఘనశ్యామ్ చాహర్.. తన పక్కింట్లో ఉండే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం వల్ల ఆమెతో సన్నితంగా మెలిగేవాడు.

ఈ క్రమంలో యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం యువతి ఎవరికీ చెప్పకపోవడాన్ని ఆ యువకుడు అవకాశంగా మలుచుకున్నాడు. దీనిని అలుసుగా తీసుకున్న ఘనశ్యామ్.. ఈ నెల 18న మరోసారి యువతిపై అత్యాచారం చేశారు. అయితే ఈ సారి ఆమె ఊరుకోలేదు. తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు తీవ్ర ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారన్న విషయం తెలుసుకున్న యువకుడు.. పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Exit mobile version