Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Crime News: డాక్టర్ రాసిచ్చిన మందులకు బదులు వేరే మందులు.. ప్రాణం కోల్పోయిన మహిళ..!

Crime News: ప్రపంచంలో ఎవరికీ అర్థం కాని భాష ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా డాక్టర్లు రాసే భాష. అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే పరీక్షించి ఆరోగ్యం కుదుట పడటానికి మందులు రాస్తారు. మనం ఎంత ప్రయత్నించినా వారు రాసిన అక్షరాలు అర్థం చేసుకోలేము.. కానీ మెడికల్ షాప్ వాడికి మాత్రం వారి భాష బాగా అర్థమవుతుంది. కొన్ని సందర్బాలలో మెడికల్ షాప్ వాళ్ళకి కి కూడా డాక్టర్స్ భాష అర్థం కాక వేరే మందులు ఇచ్చిన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. అచ్చం ఇలాంటి సంఘటన కడపలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే.. డాక్టర్ రాసిచ్చిన మందులు వాడితే ఆరోగ్యం కుదుట పడకపోగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.కడప జిల్లా రాజంపేటలోని ఎర్రబల్లి ప్రాంతానికి చెందిన సుబ్బనరసమ్మ అనారోగ్యం కారణంగా కడప లోని ఒక ఆస్పత్రికి వెళ్ళింది. అక్కడ వైద్యుడు ఆమెను పరీక్షించి మందులు రాసిచ్చాడు. బాధితురాలి కుమారుడి మెడికల్ షాప్ కి వెళ్లి మందులు అడగగా డాక్టర్ భాష అతనికి అర్థం కాక వేరే మందులు ఇచ్చాడు.

సబ్బనరసమ్మ మందులు వాడిన తర్వాత ఆరోగ్యం కుడుటపడక ఇంకా క్షీణించింది. అందువల్ల కుటుంబసభ్యులు ఆమెను మళ్ళీ ఆస్పత్రికి తీసుకెళ్లగా తాను రాసిచ్చిన మందులు కాకుండా మెడికల్ షాప్ లో వేరే మందులు ఇవ్వడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్ చెప్పారు. ఈ క్రమంలోనే బాధితురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో సుబ్బ నరసమ్మ కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై మెడికల్ షాప్ మీద దాడి చేసి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Exit mobile version