Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Crime News: అక్క పై ప్రేమతో భార్యను బలితీసుకున్న భర్త.. కేవలం ఆ చిన్న మాటకి భార్యను చంపిన భర్త!

Crime News: భార్యాభర్తల మధ్య బంధం పదికాలాలపాటు ఎంతో అన్యోన్యంగా కొనసాగాలని భావిస్తారు అయితే వీరి బంధంలో చిన్నపాటి మనస్పర్ధలు రావడం సర్వసాధారణం ఇలా వచ్చినప్పుడు ఎవరో ఒకరు కాస్త వెనక్కి తగ్గితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది లేదంటే ఆ సమస్య ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుందని ఎన్నోసార్లు రుజువైంది.ఇలా ఎంతో మంది చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటూ వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్న సంఘటనలను గురించి మనం రోజు వింటున్నాము.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. సానివాడ గ్రామానికి చెందిన 30 ఏళ్ల పొన్నాడ కల్యాణి భర్త నవీన్ కుమార్ నివసిస్తున్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి అయితే వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగి చివరికి నవీన్ కుమార్ తన భార్య కళ్యాణి పై దాడి చేయడంతో కళ్యాణి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నవీన్ తన సోదరి అంటే ఎంతో ప్రేమ. తన అక్క మాటని తప్పకుండా పాటించే వ్యక్తిత్వం కలవాడు నవీన్. అయితే నవీన్ కల్యాణి దంపతులకు 2015 లో వివాహం జరిగింది.వీరి వివాహం జరిగి ఏడూ సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ వీరికి సంతానం లేకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.ఇక శివరాత్రి పండుగ సందర్భంగా సంతానం కోసం ఉపవాసం ఉండి పూజ చేయమని నవీన్ సోదరి చెప్పడంతో కల్యాణి తన మాట వినకుండా తన పని తాను చేసుకుంది. ఈ క్రమంలోనే నవీన్ సోదరి తాను చెప్పిన మాట కల్యాణి వినడం లేదని తన భర్తకు ఫిర్యాదు చేయడంతో నవీన్ తన భార్యను అక్క చెప్పిన మాట ఎందుకు వినలేదు అంటూ ప్రశ్నించాడు.దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో మాట మాట పెరిగి చివరికి నవీన్ కళ్యాణి మొహంపై ఊపిరి ఆడకుండా చేయడంతో ఆమె మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.ఇక కళ్యాణి హత్య వెనుక తన ప్రమేయం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version