Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Crime News: తరగతి గదిలో సెల్ఫీలు తీశారని విద్యార్థి సస్పెండ్..మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య..!

Crime News: ఈ మధ్య కాలంలో పిల్లలు సెల్ఫోన్ కి బాగా అలవాటు పడ్డారు. నిత్యం ఫోన్ తో సమయం గడుపుతున్నారు. సెల్ఫీలు తీసుకోవటం,వీడియోలు చేయటం వంటివి ఎక్కువగా చేస్తున్నారు. ఇటీవల తరగతిలో సెల్ఫీలు తీసుకొని స్టేటస్ లో పెట్టడం పెట్టారని విద్యార్థిని స్కూల్ నుంచి సస్పెండ్ చేయటం వల్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్కూల్ నుండి సస్పెండ్ చేశారని మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాలలోకి వెళితే…దల్లిపేట పంచాయతీ గాలిపేటకు చెందిన యోగేందర్ రెడ్డి విజయనగరం జిల్లా భోగాపురంలోని మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల యోగేందర్ రెడ్డి తన స్నేహితులతో కలిసి తరగతిలో సెల్ఫీలు తీసుకొని స్టేటస్ లో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ సంధ్యారాణి వారి తల్లిదండ్రులను పిలిపించి పిల్లల్ని మందలించింది. ఈ క్రమంలో యోగేంద్ర రెడ్డి తండ్రి పాఠశాలకు రావడంతో మీ అబ్బాయి వల్ల పాఠశాల పరువు పోతోందని.. అందుకు ప్రతిఫలంగా టి సి ఇచ్చి పంపించేస్త అని ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగేంద్ర రెడ్డి తండ్రి ప్రిన్సిపాల్ బతిమాలినా కూడా వినకుండా యోగిందర్ రెడ్డి ని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పింది.

ప్రిన్సిపల్ చర్యకు ఆగ్రహించిన యోగేందర్ తండ్రి కుమారుడిని గట్టిగా మందలించడంతో విద్యార్థి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఆ రోజు నుండి విద్యార్థి కోసం గాలించగా శనివారం ఉదయం పాఠశాల సమీపంలో ఉన్న మామిడి చెట్టుకు వేలాడుతు శవమై కనిపించాడు. ఈ విషయం గురించి యోగేంద్ర తండ్రీ రాము పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరు అందరిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

Advertisement
Exit mobile version