Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Electric bike blast : ఎలక్ట్రిక్ బైక్ పేలి వ్యక్తి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

Electric bike blast : : పర్యావరణానికి మేలు చేసే ద్వచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. కానీ అదే బైకు కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన విజయవాడలోని సూర్యారావు పేట గులాబీ తోటలో చోటు చేసుకుంది.

Electric bike blast

సూర్యారావు పేటకు చెందిన శివ కుమార్ అనే వ్యక్తి నిన్ననే కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అయితే దాన్ని తీసుకొచ్చి ఇంట్లోని బెడ్ రూమ్ లో ఛార్జింగ్ పెట్టాడు. కానీ దురదృష్ట వశాత్తు వేకువజామున ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో శివకూమార్ ఆయన భార్య సహా ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. ఒక్కసారిగా పేలిన శబ్దం వినిపించడంతో స్థానికులంతా ఘటనా స్థలికి చేరుకున్నారు. తలుపులు పగులగొట్టి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బాధితులు తీవ్ర గాయాల పాలయ్యారు. శివ కుమార్ దంపతులు సహా పిల్లలిద్దరినీ.. ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ శివ కుమార్ మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. పిల్లలతో సహా తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Read Also :Kodada Crime : కోదాడలో దారుణం.. కూల్ డ్రింక్‌లో మత్తు కలిపి యువతిపై 3 రోజులుగా అత్యాచారం..!

Advertisement
Exit mobile version