Crime News: సమాజంలో ప్రతిరోజు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యువతితో ఏర్పడిన పరిచయం వల్ల బలవంతంగా ఆమెకు తన తమ్ముడితో వివాహం జరిపించి తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫంక్షన్లో పేరు చెప్పి అమ్మాయినీ నమ్మించి.. ఆమెను తనతో పాటు తీసుకెళ్లి, తన తమ్ముడితో బలవంతంగా పెళ్లి చేశాడు. అనంతరం ముగ్గురు సోదరులు కలిసి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు.
తన తమ్ముడు ఊరు వెళ్లిన విషయం తెలిసిన జగ్మాల్, తన తమ్ముడి భార్య అని కూడా చూడకుండా ఆమెను గదిలో బంధించి 45 రోజుల పాటు అత్యాచారం చేశాడు. జగ్మాల్ ఇంట్లో లేని సమయంలో అతని మరొక సోదరుడు హక్మా రామ్ కూడా ఆ యువతిపై అత్యాచారం చేశాడు. ఒకరోజు అదును చూసుకొని ఆ యువతి తన తల్లికి ఫోన్ చేసి, తన ఆచూకీ తెలిపింది. తనకు జరుగుతున్న అన్యాయం గురించి తన తల్లికి వివరించింది. ఆ తల్లి తన కూతురుని కాపాడుకోవడానికి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల సహాయంతో ఆ యువతిని కాపాడింది. విషయం తెలుసుకున్న జగ్మాల్, తన సోదరులు పరారీలో ఉన్నారు. పోలీసులు ఆ ముగ్గురి నిందితుల మీద అత్యాచారం, కిడ్నాప్ కేసు పెట్టారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.++
