Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Hyderabad Crime : హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్ కిరాతకం.. భార్యను చంపి ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడకబెట్టి..!

Hyderabad Crime

Hyderabad Crime

Hyderabad Crime : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపాడు. భార్య ముక్కముక్కలుగా నరికి మరి చంపాడు. మృతిదేహం గుర్తుపట్టేందుకు సాక్ష్యాధారాలు లేకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. భార్య శరీరాన్ని ముక్కలుగా నరికి వాటిని ఫ్రెషర్ కుక్కర్‌లో మరి ఉడికించాడు. ఆపై శరీర భాగాలను డ్రైనేజీలో విసిరేశాడు.

ఎముకలను మాత్రం ఇంట్లోనే కాల్చి పొడి చేశాడు. ఆ తర్వాత ఎముకల భస్మాన్ని చెరువులో పారవేశాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఇటీవలే జరిగింది. కానీ, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తానే ఆ క్రైమ్ చేశానంటూ అంగీకరించాడు. చంపింది తానే అని భర్త చెబుతున్నాడు. కానీ, ఆ చనిపోయిన మహిళ ఇతడి భార్యనే కాదా? తెలిపే ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో పోలీసులకు ఈ కేసు ఛేదించడంలో సవాల్ ఎదురైంది.

Hyderabad Crime : పోలీసుల కథనం ప్రకారం..

వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలో వెంకటరమణ, ఉప్పల సుబ్బమ్మ అనే దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. వెంకటమాధవి(35)ని అదే జిల్లాకు చెందిన గురుమూర్తికి పెళ్లి చేశారు. వారికి కూడా ఇద్దరు సంతానం. ఆర్మీలో జవాన్‌గా గురుమూర్తి పనిచేశాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. గురుమూర్తికి తన భార్యపై అనుమానం ఉండేది.

Advertisement

ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగేది. ఈనెల 16న కూడా ఇరువురి మధ్య పెద్ద గొడవకు దారితీసింది. ఆ సమయంలో వారి పిల్లలు కూడా ఇంట్లోలేరు. తన భార్య మిస్సింగ్ అంటూ మీర్ పేట్ పోలీసులకు నిందితుడు గురుమూర్తి ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా భర్త గురుమూర్తే ఈ హత్య చేశాడని పోలీసులు గుర్తించారు.

సీసీ కెమెరాల్లో భార్య మాధవి బయటకు రావడం కనిపించలేదు. గురుమూర్తి ఒక్కడే కవర్లు పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు లోపలికి వెళ్లడం కనిపించింది. గురుమూర్తిపై అనుమానంతో పోలీసులు తమదైన స్టయిల్లో విచారించగా అసలు నిజం బయటపడింది. తన భార్య వెంకటమాధవిని హత్యచేశానని పోలీసుల విచారణలో గురుమూర్తి అంగీకరించాడు.

కుక్కర్‌‌లో ఉడకబెట్టి.. ఎముకలను కాల్చి పొడిచేసి :

భార్య మృతదేహం ఎక్కడని పోలీసులు విచారించగా.. ఆమె శరీరాన్ని కత్తితో ముక్కలుగా నరికి, మాంసాన్ని వేరుచేశానని చెప్పాడు. ఆ మాంసాన్ని కుక్కర్‌‌లో ఉడికించినట్టు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. ఎముకలను కూడా కాల్చి పొడి చేసి కవర్లో తీసుకెళ్లి చెరువులో పడవేసినట్టు తెలిపాడు. కుక్కర్‌లో ఉడికిన ముక్కలను డ్రైనేజీల్లో పడేశానని తెలిపాడు. భార్యను చంపడానికి ముందు రోజున ఒక కుక్కను కూడా చంపేసి అలానే కుక్కర్‌లో ఉడికించినట్టు విచారణలో బయటపెట్టాడు.

Advertisement

అయితే, పోలీసులకు ఇక్కడ ఒక సవాల్.. గురుమూర్తి హంతకుడని తేలిపోయింది. కానీ, ఆ నేరాన్ని నిరూపించే సాక్ష్యాధారాలు పోలీసులకు ఏ ఒక్కటి లభించలేదు. ఏ ఆనవాళ్లు కూడా పోలీసులకు దొరకకుండా నిందితులు జాగ్రత్తపడ్డాు. ఇంతకీ, చనిపోయింది వెంకటమాధవి అనే విషయాన్ని పోలీసులు నిరూపించాల్సి ఉంది. ఆమె మృతదేహం భాగాలు దొరికితే వాటి ఆధారంగా హత్యకు గురైంది ఆమేనని పోలీసులు నిరూపించేందుకు వీలుంటుంది.

Read Also : Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష..!

Advertisement
Exit mobile version