Crime News: నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటాడు. బాలకృష్ణ గత కొన్ని సంవత్సరాలుగా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం హిందూపురంలో బాలకృష్ణ పిఎ బాలాజీని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ విషయం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది.పేకాట స్థావరాలుగా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేయగా వారిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఉండటంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..
ప్రత్యర్థి పార్టీ నాయకులతో కలిసి బాలకృష్ణ పిఏ ఇలా పేకాట ఆడుతూ పట్టుబడటం హిందూపురంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం గురించి బాలకృష్ణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న సంగతి ఆసక్తికరంగా మారింది. హిందూపురంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటినుంచి బాలాజీ వ్యవహరిస్తూ నియోజకవర్గంలోని రాజకీయ వ్యవహారాలను బాలాజీ దగ్గరుండి చూసుకునేవాడు. బాలకృష్ణ ప్రియ మీద ఇలాంటి ఆరోపణలు రావడంతో బాలకృష్ణ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.