Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

ITR Filing 2025 : బిగ్ అలర్ట్.. కొత్త ఐటీ కోడ్.. సోషల్ మీడియా నుంచి సంపాదించే వారు ఇకపై ITR దాఖలు చేయాల్సిందే..!

ITR Filing 2025

ITR Filing 2025

ITR Filing 2025 : ఆదాయపు పన్ను శాఖ తొలిసారిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పన్ను వ్యవస్థలో ప్రత్యేక కేటగిరీగా చేర్చింది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు (ITR Filing 2025) పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు కొత్త ప్రొఫెషన్ కోడ్ 16021 ఉపయోగించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బ్రాండ్‌లు, ప్రొడక్టులను క్యాంపెయిన్ చేయడం ద్వారా సంపాదించే వారికి ఈ కోడ్ వర్తిస్తుంది.

2024-25 ఆర్థిక సంవత్సరం (అసెస్‌మెంట్ ఇయర్ 2025-26) కోసం జారీ చేసిన ITR యుటిలిటీలలో ఈ మార్పు చేసింది. ITR-3 లేదా ITR-4 (సుగమ్) నింపే ఇన్ఫ్లుయెన్సర్లు ఈ కోడ్‌ను ఎంటర్ ఉంటుంది. ఈ రెండు ఫారమ్‌లు స్వయం ఉపాధి నిపుణులు, చిన్న వ్యాపారవేత్తల కోసం తీసుకొచ్చారు.

ITR Filing 2025 : ఏ ఫారమ్‌ను ఎవరు నింపాలి? :

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు, ఆన్‌లైన్ కోచ్‌లు, డిజిటల్ గిగ్ వర్కర్లు రిటర్న్‌లను దాఖలు చేసేందుకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. తమ వాస్తవ ఆదాయం, ఖర్చులను చూపించవచ్చు.

Advertisement

ఊహాజనిత పన్నును ఎంచుకోవచ్చు. మీరు ఊహాత్మక పన్నును ఎంచుకుంటే విస్తృతమైన బుక్ కీపింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. దీని కింద, మొత్తం ఆదాయంలో కొంత భాగాన్ని పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తారు.

ఆదాయాన్ని వ్యాపారంగా పరిగణిస్తే.. మొత్తం రసీదులలో 8శాతం (లేదా డిజిటల్ పేమెంట్లపై 6శాతం) సెక్షన్ 44AD కింద పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తారు. ఆదాయాన్ని వృత్తిగా పరిగణిస్తే.. మొత్తం రసీదులలో 50శాతం సెక్షన్ 44ADA కింద పన్ను విధిస్తారు. అంచనా పన్నును ఎంచుకునే వారు ITR-4ను దాఖలు చేయాలి. అయితే, టర్నోవర్ ఆదాయపు పన్ను చట్టం సూచించిన పరిమితుల్లో ఉంటే వృత్తి లేదా వ్యాపారంలో గందరగోళం కొనసాగుతుంది.

Read Also : Samsung Galaxy A55 5G : అమెజాన్ ఆఫర్ అదిరింది బ్రో.. అతి తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Advertisement

ఇన్‌ఫ్లుయెన్సర్ వృత్తి వర్గీకరణకు సంబంధించి ఇప్పటికీ అస్పష్టత ఉందని పన్ను నిపుణులు అంటున్నారు. ఆదాయపు పన్ను చట్టంలోని రూల్ 6F కింద కొన్ని నోటిఫైడ్ వృత్తులను ప్రస్తావించారు. కానీ, కంటెంట్ క్రియేషన్ అందులో చేర్చలేదు.

ఇలాంటి పరిస్థితిలో ఆడిట్ పరిమితికి సంబంధించి గందరగోళం ఉండవచ్చు. ఇన్‌ఫ్లుయెన్సర్ వర్క్ ‘వృత్తి’గా పరిగణిస్తే ఏ సెక్షన్ పరిగణనలోకి తీసుకుంటారో తెలుసుకుందాం. ఒక వృత్తిగా పరిగణిస్తే.. సెక్షన్ 44ADA కింద ఖర్చులు, తగ్గింపుల ప్రయోజనాన్ని పొందుతారు. మరోవైపు, వ్యాపారంగా పరిగణిస్తే సెక్షన్ 44AD వర్తిస్తుంది.

ITR Filing 2025

ITR Filing 2025 : ITR దాఖలు ప్రక్రియ ఇలా :

కొత్త నిబంధనల ప్రకారం.. ఇన్ఫ్లుయెన్సర్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఈ కింది ఇచ్చిన దశలను అనుసరించాల్సి ఉంటుంది.

Advertisement

సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్ఫ్లుయెన్సర్ ఆర్థిక వ్యవస్థను అధికారిక పన్ను చట్రంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ దిశగా చర్య తీసుకుంది. అయితే, ఈ కొత్త వ్యవస్థను అమలు చేయడంలో ఎలాంటి నియమాలు రూపొందించనున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version