ICICI Bank Minimum Balance 50K : ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ప్రైవేట్ రంగ బ్యాంకు ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ పరిమితిని భారీగా పెంచేసింది. ఇప్పుడు ICICI బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ. 50వేలు మినిమం బ్యాలెన్స్‌ను ఉంచుకోవాలి.
ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 నుంచే అమలులోకి వచ్చింది. కనీస బ్యాలెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో బ్యాంక్ చేసిన మార్పులతో మెట్రో సిటీల నుంచి గ్రామాల వరకు సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ పరిమితిని పెంచింది. ఇప్పుడు మెట్రో, పట్టణ ప్రాంతాలలో కనీసం రూ. 50 వేలు, సెమీ-అర్బన్ ప్రాంతాలలో రూ. 25 వేలు, గ్రామాలలో రూ. 10 వేలు సగటు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
Read Also : Vivo T4 5G : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. క్రేజీ ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే!
గతంలో, మెట్రో, పట్టణ ప్రాంతాల్లో సగటున కనీసం రూ. 10వేలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని బ్రాంచులలో రూ. 5వేలు, గ్రామాల్లోని బ్రాంచులలో కనీసం రూ. 2,500 కనీస బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి ఉంటుంది. కనీస అకౌంట్ బ్యాలెన్స్ పరిమితి పెంపుతో దేశీయ బ్యాంకులలో ICICI బ్యాంక్ అత్యధిక మినీమం అకౌంట్ బ్యాలెన్స్ (MAB) కలిగి ఉంది.
ICICI Bank : ఇతర బ్యాంకుల కనీస బ్యాలెన్స్ ఎంతంటే? :
ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంటులో కనీస బ్యాలెన్స్ లిమిట్ రూ. 50వేలకు పెంచింది. అదే సమయంలో, ప్రభుత్వ రంగంలో దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ (State Bank Of India) 2020 లోనే సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిబంధనను తొలగించింది. మిగిలిన బ్యాంకులు నిర్వహణ ఖర్చు కోసం సేవింగ్స్ అకౌంట్లలో కనీసం రూ. 2వేల నుంచి రూ. 10 వేల వరకు కనీస బ్యాలెన్స్ రూల్ పెట్టాయి.
దేశంలోని ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంకు HDFC బ్యాంక్ విషయానికి వస్తే.. మెట్రో, పట్టణ బ్రాంచ్ సేవింగ్స్ అకౌంట్లలో కనీసం రూ. 10వేలు ఉండాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లోని HDFC బ్యాంకులలో రూ. 5వేలు, గ్రామాల్లోని బ్రాంచులకు రూ. 2500 కనీస బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి చేసింది.
ICICI Bank : కనీస బ్యాలెన్స్ లేకపోతే ఏమౌతుంది? :
ICICI బ్యాంకు రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం కనీస బ్యాలెన్స్ రూల్స్ తీసుకొచ్చింది. మీరు ఈ లిమిట్ కన్నా తక్కువగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఆగస్టు 1న ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లకు కనీస బ్యాలెన్స్ లిమిట్ పెంచింది. బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాలెన్స్‌ను వెంటనే చెక్ చేసుకోవాలి. తద్వారా ఎలాంటి పెనాల్టీలు పడకుండా అవసరమైన బ్యాలెన్స్‌ను ఉంచుకోవచ్చు.