Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold Rate Today : బంగారం కొనేవారికి పండగే, భారీగా దిగొస్తున్న బంగారం, వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంత తగ్గాయంటే?

Gold Rate Today Feb 9 2026

Gold Rate Today Feb 9 2026 ( Image Credit to Original Source )

Gold Rate Today Feb 9, 2026 : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. రూ. 2 లక్షల దగ్గరగా వెళ్లిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి.

ఏకంగా రూ. 4 లక్షలు దాటేసిన వెండి ధరలు సైతం వేగంగా తగ్గుతున్నాయి. ఫిబ్రవరి 9న సోమవారం కూడా బంగారం ధరలో తగ్గుదల కొనసాగుతోంది. ఈరోజు ఉదయం, రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.156740కి పడిపోయింది.

ముంబైలో ధర 10 గ్రాములకు రూ.156590కి తగ్గింది. ఒక వారంలోనే 24 క్యారెట్ల బంగారం రూ.3980 వద్ద బలహీనపడింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.3650 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్పాట్ ధర ఔన్సుకు 4887.30 డాలర్లుగా ఉంది.

Advertisement

కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి ఫుల్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు ఔన్సుకు 6,300 డాలర్లకు చేరుకుంటాయని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. 2026 నాటికి కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోళ్లు 800 టన్నులకు చేరుకోవచ్చని అంచనా వేసింది.

Gold Rate Today Feb 9, 2026 : ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా :

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.156,740 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 143,690కు పలుకుతోంది. ప్రస్తుతం, ముంబై, చెన్నై, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 143540 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 156590గా ఉంది.

పూణే, బెంగళూరులో ఈ రెండు నగరాల్లోనూ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 156590, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 143540 పలుకుతోంది.

Advertisement

Read Also : Gold Rate Today 25 January 2026 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? జనవరి 25న ఈరోజు బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. రికార్డు స్థాయిలో బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590 ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,540గా ఉంది.

అదేవిధంగా విజయవాడ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,590 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,540గా ఉంది.

Advertisement

వెండి ధర ఎంతంటే? :
మరో విలువైన లోహం వెండి కూడా భారీగా తగ్గుతోంది. ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం వెండి ధర కిలోగ్రాముకు రూ. 284,900. వారంలో వెండి రూ. 65,000 తగ్గింది.

జనవరి 30న వెండి ధర రూ. 4 లక్షలకు పైగా ఉంది. విదేశీ మార్కెట్లలో స్పాట్ ధర ఔన్సుకు 74 డాలర్లు పలుకుతోంది. అలాగే, హైదరాబాద్‌ నగరంలో కిలో వెండి ధర రూ.2,84,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement
Exit mobile version