Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold Price Today : ఇదేం ట్విస్ట్ భయ్యా.. యుద్ధం వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు, ఈరోజు ఎంత తగ్గాయో తెలుసా?

Gold Price Today

Gold Price Today (Image Credit: AI-Generated | For Illustration )

Gold Price Today : ఒకవైపు యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మిస్సైళ్లతో విరచుకుకుపడుతున్నాయి. ప్రపంచ ఉద్రికత్తల మధ్య బంగారం ధరలు అమాంతం పెరుగుతాయి. ఈ యుద్ధ పరిస్థితుల ప్రభావం ఎక్కువగా బంగారంపై పడుతుంది.

కానీ, ఊహించని విధంగా బంగారం ధరలు యూటర్న్ తీసుకున్నాయి. పెరగాల్సిన బంగారం ధరలు అమాంతం తగ్గాయి. ఈ సమయంలో బంగారంపై (Gold Price Today) పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిగా చూపించగా సడెన్ గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయింది. బంగారం కొనేవారికి మాత్రం ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.

పసిడి ప్రియులు ఎగిరిగంతేసి (Gold Rate Today) కొనేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తగ్గిన బంగారం ధరలు అలానే ఉంటాయా? లేదా ఇంకా తగ్గుతాయా? అనేది క్లారిటీ లేదు. ఏది ఏమైనా మార్చి 2న బంగారం ధరలు మాత్రం సడెన్ ట్విస్ట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాయి.

Advertisement

పసిడి ప్రియులు బంగారం కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే బంగారం ధరలు ఏ క్షణమైనా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి బంగారం ధరలు తగ్గడం తాత్కాలికమే కావొచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ట్రేడ్ అవుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

22K, 24K బంగారం ధరలివే :
24 క్యారట్ల గోల్డ్ గ్రాము ధర రూ.329 తగ్గగా రూ.16,980గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల గ్రాము గోల్డ్ ధర రూ.300 తగ్గింది. దాంతో రూ.15,565 వద్ద ఉంది. 18 క్యారట్ల గ్రాము గోల్డ్ ధర రూ.246 తగ్గింది. దాంతో రూ.12,755 ధర పలుకుతోంది.

Read Also : Gold Rate Today : బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, ఏపీ, తెలంగాణలో ఈరోజు రేట్లు ఇవే

Advertisement

100 గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ ధర 32,900 తగ్గగా రూ.16,98,000 వద్ద ఉంది. 22 క్యారట్ల గోల్డ్ ధర 100 గ్రాములుకు రూ.30వేలు తగ్గగా రూ. 15,56,500 వద్ద ఉంది. 18 క్యారట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు రూ.24,600 తగ్గింది. ఫలితంగా రూ.12,73,500 వద్ద గోల్డ్ ధర కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరల ప్రకారం 10 గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ ధర రూ.3,290 తగ్గింది. దాంతో నగరంలో పసిడి ధర రూ.1,69,800 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డ్ ధర రూ.3వేలు తగ్గింది. ఫలితంగా పసిడి ధర రూ.1,56,650కు చేరింది. 10 గ్రాముల 18 క్యారట్ల గోల్డ్ ధర రూ.2,460 తగ్గింది. దాంతో రూ.1,27,350గా ట్రేడ్ అవుతోంది.

విజయవాడలో బంగారం 10 గ్రాములకు 24 క్యారట్లు ధర రూ.3,290 తగ్గింది. దాంతో రూ.1,69,800కు చేరింది. 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డ్ ధర రూ.3వేలు తగ్గడంతో రూ.1,56,650 ధర వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారట్ల పసిడి ధర రూ.2,460 తగ్గింది. దాంతో రూ.1,27,350గా ట్రేడ్ అవుతోంది.

Advertisement
Exit mobile version