Upasana konidela: మెగాస్టార్ చిరంజీవికి వారసుడు ఎప్పుడు వస్తాడా అని అభిమానుల్లో ఒకటే ఆత్రుత ఉంది. వారిద్దరి కుంటే కూడా ఫ్యాన్స్ లోనే ఎక్కువ ఆరాటం కనిపిస్తోంది. అయితే దానికి ఇప్పుడేం తొందరా ఇంకా టైం ఉందిగా అన్నట్టుగా ఉంటున్నారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. అయితే ఉపాసనకు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలా సార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎప్పుడైన లైవ్ లోకి వచ్చిందంటే చాలూ అభిమానులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటూ. అయితే వాటిపై మాత్రం ఉపాసన ఎక్కడా నోరు మెదపడం లేదు. చిన్న హింట్ కూడా ఇవ్వడం లేదు.
అయితే తాజాగా ఉపాసన తన కాబోయే సంతానంపై హింట్ ఇచ్చింది. అదెంటో తెలుసు కోవాలని ఉందా.. అయితే సేవ్ సాయిల్ నినాదంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అయితే తాజాగా ఆయన అమెరికన్ తెలుగు అసోసియేషన్- ఆటా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ లో ఉపాసన సద్గురును కొన్ని ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగా రీ ప్రొడక్షన్ గురించి ఉపాసన ప్రశ్నలు సంధించింది.
ఉపాసన అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సద్గురు.. రీ ప్రొడక్షన్ అయితే వద్దని చెబుతానని అన్నారు. నువ్వు ఒక వేళ లేడీ టైగర్ అయితే పిల్లల్ని కనమని చెప్పేవాడిని.. ఎందుకంటే అవి అంతరించి పోయే దశలో ఉన్నాయి. కానీ మనుషులం చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. కాబట్టి పిల్లల్ని కనకుండా ఉండటమే అందరూ చేసే సాయమని.. పిల్లల్ని కననివారికి అవార్డు కూడా ఇస్తానంటారు.
ఈ వీడియోలు నెట్ట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన ఉపాసన.. సద్గురుతో ఇలా సంభాషించడం సంతోషంగా ఉందని చెప్పింది. సద్గురు.. మా తాత మీరు ఇచ్చే అవార్డును స్వీకరించేందుకు ఒప్పుకోవడం లేదు అని పోస్టు చేసింది ఉపాసన. అంటే ఉపాసన సద్గురు ఇచ్చే అవార్డును తీసుకోనని చెప్పకనే చెప్పింది. తాను పిల్లల్ని కంటానని చెప్పింది కానీ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.