Shravana bhargavi : స్టార్ సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవిల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సింగింగ్ కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేసిన వీరిద్ది మధ్య పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారి ఆ తర్వాత కొంత కాలానికి ప్రేమగా మారింది. 2013లో వీరికి ఘనంగా పెళ్లి జరగగా.. ఆ తర్వాత కొన్నేళ్లకు పాప కూడా పుట్టింది. అయితే పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత వీరు విడిపోబోతున్నట్లు వార్తలు వస్తున్నారు. అందుకు కారణం వీరిద్దరి మధ్యా మనస్పర్థలు రావడమేనని తెలుస్తోంది. అంతే కాదండోయ్ అందువల్లే వీరిద్దరూ విడిగా ఉంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ సింగర్స్ అయిన వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయట. అందుకే వీరు విడిపోవాలి అనుకుంటున్నట్లు లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం వీరిద్దరూ వేరుగా ఉంటున్నారని సమాచారం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు విడిపోతున్నారంటే చాలా మంది నమ్మట్లేదు. అదేంటి వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించే వరకూ దీనిలో నిజం ఎంత ఉందో మనకు తెలియదు. నిజం తెలియాలంటే మనం ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.
Read Also : Ram Gopal Varma: రాష్ట్రపతి అభ్యర్థి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ….?