TS Academic Calendar : తెలంగాణ స్కూల్స్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల.. సెలవులు ఎప్పడెప్పుడంటే?

TS Academic Calendar : తెలంగాణ విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ అకడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాథమిక పాఠశాలలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 నిమిషాల వరకు పనిచేస్తాయి. ఉన్నత పాఠశాలలు ఉదయం 9గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.45 నిమిషాల వరకు విధులు నిర్వహిస్తాయి. 2022-23 సంవత్సరంలో 230 పనిదినాలతో పాఠశాలలు పనిచేస్తాయని విద్యా క్యాలెండర్‌లో పేర్కొన్నారు.

TS Academic Calendar 2022-23 Released in Telangana State

నవంబరు 1 నుంచి 7 వరకు SA1 పరీక్షలు, 2023 ఏప్రిల్ 10 నుంచి 17 వరకు SA2 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 28లోగా 10వ తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు పూర్తి చేయాలని పేర్కొంది. వచ్చే ఏడాది మార్చిలోనే 10వ తరగతి పరీక్షలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9 వరకు 14 రోజులు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలంగాణ అకడమిక్‌ క్యాలెండర్‌లో వెల్లడించారు. ఈ అకడిమిక్ ఇయర్‌కు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు తమ సిలబస్ పూర్తిచేయాల్సి ఉంటుందని, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించింది.

Advertisement

ప్రాథమిక పాఠశాలల పనిదినాలు ‌:
– ఉదయం 9am నుంచి 4pm వరకు తరగతులు

ప్రాథమికోన్నత పాఠశాలలు :
ఉదయం 9am నుంచి 4.15pm వరకు తరగతులు

Advertisement

ఉన్నత పాఠశాలల తరగతులు :
ఉదయం 9.30am నుంచి 4.45pm వరకు తరగతులు

సెలవులు :
సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 10 వరకు దసరా సెలవులు (14రోజులు) ఉంటాయి.
బతుకమ్మ, దసరా పండుగలకు సెల‌వులు క‌లిపి 16 రోజులు సెలవులు
క్రిస్మస్ సెలవులు.. డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు ఉంటాయి.
జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు (5 రోజులు) ఉంటాయి.

Advertisement

ఏప్రిల్‌ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు

వేసవి సెలవులు :
– ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు వేసవి సెలవులు ఉంటాయి.

Advertisement

Read Also : Ramya Raghupathi: రమ్య రఘుపతి వ్యాఖ్యలపై స్పందించిన పవిత్ర లోకేష్?

Advertisement
Tufan9 Telugu News

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

3 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

3 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

3 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

3 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

3 months ago

This website uses cookies.