Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘ఎతర్క్కుం తునింధవన్’ (ET) సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటానికి రెడీగా ఉన్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ఈ పోస్టర్లు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ పాత్రలో నటించారు. ఈ సినిమా మార్చి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నేడు సాయంత్రం 6 గంటలకు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నేడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని దస్పల్లా కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు.ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు టాలీవుడ్ కు చెందిన ముగ్గురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వీరిలో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ గోపీచంద్ మలినేని, అలాగే హీరో రానా ముఖ్య అతిథులుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనబోతున్నారు.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగు,హిందీ, కన్నడ,మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ క్రమంలోనే ఈ సినిమా 10వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక సూర్య నటించిన సినిమాలకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే తమిళంలో సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ చేసి తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే సూర్యకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. మరి ఈ సినిమా ద్వారా సూర్య ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.