Sarkaru Vari Pata : మహేష్ బాబు ” సర్కారు వారి పాట ” లోని కళావతి కోసం ఎంత ఖర్చు పెట్టారంటే ..!

Sarkaru Vari Pata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘కళావతి’ అంటూ సాగే ఈ పాట కోసం సింగర్ సిద్ శ్రీరామ్ తో పాటు, తమన్.. కొందరు మ్యుజీషియ‌న్స్ తీసుకొని పాటను చిత్రీకరించారు.

కాగా ఇటీవల సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా లిరికల్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమా నుంచి ఈ లిరికల్ వీడియోలకు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. మ్యుజీషియ‌న్స్ ను, సింగ‌ర్స్‌ ను తీసుకొచ్చి లిరికల్ వీడియోలను స్పెషల్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలను ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మూవీ యూనిట్ అంతా ఒక రెండు నిమిషాల పాటు ఈ సాంగ్ లో కనిపించి అలరించడం తెలిసిన విషయమే. అయితే ఈ ఒక్క పాట కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. అవును అక్షరాల రూ. 60 లక్షలు ఈ కళావతి సాంగ్ కోసం ఖర్చు పెట్టారు.

Advertisement
mahesh-babu-sarkaru-vari-pata-kalavathi-song-details

సినిమా నుంచి విడుదలవుతున్న మొదటి పాట కావడంతో మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అంత ఖర్చు ఛేసినట్టు సమాచారం. కాకపోతే ఈ పాట ముందే లీకవ్వడంతో… వారి కష్టమంతా వృధా అయింది. దీంతో ఇక చేసేది ఏమిలేక ముందే పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Read Also : Health Tips : పానీపూరి తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా ?

Advertisement
admin

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Recent Posts

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…

2 days ago

Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…

3 days ago

Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…

3 days ago

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

2 weeks ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

2 weeks ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

2 weeks ago

This website uses cookies.