Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Cholesterol Levels : కొలెస్ట్రాల్ తగ్గించాలా? డాక్టర్ చెప్పిన 2 సింపుల్ పనులు ప్రతిరోజూ తప్పక చేయండి

Cholesterol Levels

Cholesterol Levels

Cholesterol Levels : మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా? ఎలా కంట్రోల్ చేయాలో తెలియడం లేదా? ఎన్ని మందులు వాడినా అదే సమస్య వేధిస్తోందా? అయితే మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడమే ఇందుకు కారణం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వేగంగా పెరుగుతున్నాయి.

వాస్తవానికి, కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అత్యంత  అవసరమైన కొవ్వు. కానీ, అధికం మొత్తంలో కొవ్వు హానికరం కావచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే కొవ్వు క్రమంగా రక్త నాళాలలో పేరుకుపోతుంది. రక్త ప్రసరణను అడ్డంకిగా మారుతుంది. అలసట, తలతిరగడం, చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా నొప్పి, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో అసాధారణ ఒత్తిడికి దారితీస్తుంది. మీ కళ్ళ చుట్టూ చర్మంలో మార్పులు వస్తాయి.

చర్మం పొరలుగా మారుతుంది. ఉన్నట్టుండి బరువు పెరిగిపోతారు. ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరిగింది అనడానికి ముఖ్యమైనా సంకేతాలు కావచ్చు. వైద్య పరీక్ష లేకుండా చాలా మంది సాధారణ అలసట లేదా వృద్ధాప్య సంకేతాలుగా తప్పుగా భావిస్తారు.

Advertisement

Read Also : Heart Blockage Symptoms : ఛాతీ నొప్పితో పాటు మీలో ఈ 4 లక్షణాలు ఉంటే హార్ట్ బ్లాక్‌కు సంకేతం కావొచ్చు

అదనంగా, దీర్ఘకాలిక హై కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ధమనులలో కొవ్వు పేరుకుపోతే రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. అవయవాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది.

కొన్నిసార్లు, ఈ సమస్య రక్తపోటులో ఆకస్మిక పెరుగుదలకు దారితీస్తుంది. తీవ్రమైన ఛాతీ నొప్పిగా కనిపిస్తుంది. అందుకే ప్రారంభ లక్షణాలను అసలు అశ్రద్ధ చేయొద్దు. కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు మీరు ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Advertisement

Cholesterol Levels : కొలెస్ట్రాల్ కంట్రోల్ ఎలా చేయాలి? :

కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడానికి ముందుగా మీ ఆహారంపై శ్రద్ధ వహించాలని ఢిల్లీ ఎంసీడీకి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. వేయించిన, కొవ్వు పదార్ధాలను బాగా తగ్గించాలన్నారు. తాజా పండ్లు, కూరగాయలు, ఓట్స్, వేరుశెనగలు, అవిసె గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవాలని సూచించారు. నడక, యోగా లేదా సైక్లింగ్ వంటి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచించారు.

హై కొలెస్ట్రాల్ రిస్క్ ఎవరికి ఎక్కువంటే? :

వేయించిన లేదా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తినేవారికి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యం సేవించడం వల్ల కూడా కొలెస్ట్రాల్ త్వరగా పెరుగుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం.. గుండె జబ్బులు లేదా కొలెస్ట్రాల్ సమస్యలు అధికంగా ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి :

కొలెస్ట్రాల్‌ కంట్రోల్ ఉంచేందుకు సకాలంలో పరీక్షలు చాలా అవసరం. క్రమం తప్పకుండా రక్తపోటు, షుగర్ పరీక్షలు చేయించుకోండి. మీ బరువు ఎంతో చెక్ చేసుకోండి. ఎక్కువసేపు కూర్చోకుండా నడవడం అలవాటు చేసుకోండి. అలాగే సమతుల్య ఆహారం తీసుకోండి. మంచి లైఫ్ స్టయిల్ అలవాటు చేసుకోండి. ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం వంటి ఏవైనా లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Advertisement
Exit mobile version