G
Telugu News » TV Serials » sakshi plans to take advantage of vasudharas situation in todays guppedantha manasu serial episode
⚡ TV Serials, Latest, Trending

Guppedantha Manasu : సాక్షిని అందరి ముందు అవమానించిన రిషి.. రొమాంటిక్ మూడ్ లో వసు,రిషి

Guppedantha Manasu , గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ ,రిషి,వసుధార,సాక్షి,దేవయాని,జగతి,guppedantha manasu 27-7-2022 serial,telugu news,గుప్పెడంత మనసు ఎపిసోడ్

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Guppedantha Manasu july 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సాక్షి అవకాశం దొరికింది కదా అని వసుధారపై లేనిపోని చాడీలు చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి ఎలా అయినా అందరి ముందు వసుని అవమానించాలి అని అనుకొని ఇలాంటి తప్పుచేయకుండా ఉండాలి అంటే పనిష్మెంట్ ఇవ్వాలి అని అనగా వెంటనే రిషి కూడా అవును తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటాడు. ఆ మాటకు వసుధర, మహేంద్ర దంపతులు షాక్ అవుతారు. తప్పకుండా శిక్ష వేయాలి, ఒకవేళ శిక్ష వేయాల్సి వస్తే అది నాకు వేయాలి అనడంతో అందరూ ఒకసారిగా ఆశ్చర్యపోతారు.

Guppedantha Manasu july 27 Today Episode

అప్పుడు సాక్షి నీకు శిక్ష వేయడం ఏంటి రిషి అని అడగగా వెంటనే రిషి తన జేబులో ఉన్న పెన్ డ్రైవ్ ను చూపిస్తాడు. అది చూసి వసుధార ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. అప్పుడు రిషి వసు ది తప్పులేదు నాదే తప్పు అనడంతో సాక్షి సైలెంట్ అయిపోతుంది. అప్పుడు రిషి ఈ కాలేజీ ఎండి ని నేను ఏదైనా అరవాలి అన్నా పనిష్మెంట్ ఇవ్వాలి అన్నా నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాలి గాని నువ్వు ఎందుకు అంతలా అరుస్తున్నావు అంటూ సాక్షిని అందరి ముందు అవమానిస్తాడు రిషి.  వెంటనే సాక్షి రిషి అని అనగా నాకు కాదు చెప్పాల్సిన వారికి సారీ చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వసు జరిగిన విషయాన్ని తలచుకుంటూ రిషి క్యాబిన్ కు వెళ్తుంది. అక్కడ రిషి లేకపోవడంతో జరిగిన విషయాల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి అక్కడికి రావడంతో అప్పుడు జరిగిన విషయం గురించి అడగగా వెంటనే రిషి కోపడుతూ వసుధారపైన సీరియస్ అవుతాడు.

గుప్పెడంత మనసు సీరియల్ జూలై 27 ఈరోజు ఎపిసోడ్:  రొమాంటిక్ మూడ్ లో వసు,రిషి

ఎందుకు ఈమధ్య ఇంతలా పరధ్యానంతో ఉంటున్నావు అసలు ఏమైంది అంటూ వసుధారపై ఒక రేంజ్ లో విరుచుకుపడతాడు. అప్పుడు వసుధర ఎమోషనల్ నాదే పొరపాటు సార్ అంటూ గట్టిగా ఏడుస్తుంది. అది చూసిన రిషి బాధపడుతూ ఏడవకు వసు ఏమైంది ఇప్పుడు అంటూ వసుదారని ఓదార్చగ,అయినా ఏడుస్తూ ఉండడంతో ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు అంటూ వసుధార కన్నీళ్లు తుడుస్తాడు రిషి. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉండగా రిషి ధరణిని కూడా కూర్చొని భోజనం తినమని అనడంతో ధరణి వద్దు మళ్లీ తింటాను అని అనగా వెంటనే రిషి,దేవయాని వైపు చూస్తాడు. అప్పుడు దేవి అని ఏంటి రిషి నా వైపు చూస్తున్నావు మీ ఇద్దరిని వదిన ఇంతకు ముందులా లేదు చాలా మారిపోయింది అని అంటుంది. ఆ తర్వాత దేవయానికి కావాలనే భోజనం చేస్తున్నప్పుడు సాక్షి గురించి ప్రస్తావిస్తుంది.

Guppedantha Manasu july 27 Today Episode

అప్పుడు వసుధారని చిన్న చూపు చేసి మాట్లాడడంతో వెంటనే రిషి భోజనం తినకుండా చేతులు కడిగేసి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో జగతి దంపతులు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత రిషి ఒక్కడే కూర్చుని ఉండగా ఇంతలో సాక్షి ఫోన్ చేస్తుంది. అప్పుడు చెప్పు సాక్షి అని అనగా ఇంతలోనే వసుధార అక్కడికి వస్తుంది. అప్పుడు సాక్షి ఫోన్లో ఏం లేదు రిషి నిద్ర రావట్లేదు నీతో కబుర్లు చెబుదామని ఫోన్ చేశాను అనడంతో గుడ్ నైట్ అంటూ చిరాకుగా ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు వసుధార వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా రిషి పిలిచి ఎందుకు ఈ టైం లో వచ్చావు అని అడగగా చదువులు పండుగ గురించి వచ్చాను అనడంతో టైము పాడు లేదా అని ఇక్కడే ఉండు నిన్ను నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి లోపలికి కార్ కీస్ తీసుకొని రావడానికి వెళ్తాడు.

Advertisement

అప్పుడు దేవయానికి సాక్షి ఫోన్ చేసి జరిగింది మొత్తం వివరించడంతో దేవదాని ఒక్క నిమిషం ఉండు అంటూ వసు ఈ టైంలో ఎందుకు వచ్చింది ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరూ అని అనగా ఆ మాటలు విన్న సాక్షి షాక్ అవుతుంది. అప్పుడు వెంటనే దేవయాని దీనినే నువ్వు అవకాశంగా తీసుకొని నీకు అనుకూలంగా మార్చుకో అని అంటుంది. ఆ తర్వాత వసు, రిషి ఇద్దరూ ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కారులో ఎక్కడానికి వసు నడుచుకుంటూ ఆలోచిస్తూ వెళుతుండగా అనుకోకుండా కింద పడిపోతూ ఉండడంతో వెంటనే వెళ్లి రిషి పట్టుకుంటాడు. ఆ తర్వాత వారిద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు.

Guppedantha Manasu july 27 Today Episode

ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి ఈ వసుధారకి ఉన్న తెలివితేటల్లో పావు వంతు కూడా సాక్షికీ లేవు అని అనుకుంటుంది. అప్పుడు రిషి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు సాక్షి వస్దారని ప్రశ్నిస్తూ ఏంటి ఈ టైంలో వచ్చావు అనగా వెంటనే చూసి కాలేజ్ పని కోసం వచ్చింది అనడంతో దేవయాని మౌనంగా ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా అని అనగా అన్ని ఫోన్ లోనే జరగవు కదా మేడం అంటూ కౌంటర్ ఇస్తుంది వసు.

Read Also : Guppedantha Manasu : కన్నీళ్లు పెట్టిన వసుధార.. వసుధార కన్నీళ్లు తుడిచిన రిషి..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Guppedantha ManasujagathimahendraRishivasu
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు