G
Telugu News » TV Serials » rishi gets suspicious of vasudharas behaviour in class in todays guppedantha manasu serial episode
⚡ TV Serials, Latest, Trending

Guppedantha Manasu Aug 19 Today Episode : రిషికి రింగు చేయించాలి అనుకున్న వసు..ఒకే కారులో జగతి దంపతులు వసు,రిషి..?

Guppedantha Manasu Aug 19 Today Episode, guppedantha manasu 19-8-2022 serial , గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజుది, vasudhara, rishi, guppedantha manasu, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Guppedantha Manasu Aug 19 Today Episode  : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి అన్న మాటలకు జగతి సంతోషపడుతూ ఉంటుంది.  ఈరోజు ఎపిసోడ్ లో జగతినీ రిషి ఇప్పటినుంచి నన్ను రిషి సార్ అని కాకుండా రిషి అని పిలవండి అనడంతో జగతి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు జగతితో మీరు నా విషయంలో చాలా హెల్ప్ చేశారు అందుకే థాంక్స్ చెప్పాను అని చెప్పి ఎక్కడినుంచి వెళ్ళిపోతాడు రిషి. అప్పుడు అక్కడికి మహేంద్ర రావడంతో మహేంద్ర తో చెప్పుకుని ఇంకా సంతోషపడుతుంది జగతి.

Rishi gets suspicious of Vasudhara’s behaviour in class in todays guppedantha manasu serial episode

మరొకవైపు వసుధార ఎంగేజ్మెంట్ చూస్తూ రిషి సార్ ఈ రింగు కావాలని తీసుకు వచ్చాడా లేదంటే అనుకోకుండా తీసుకోవచ్చాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన బుక్కులో వి ఆర్ అని రాసుకుంటూ తాను ఆర్ అనే అక్షరంతో రింగు చేయించాలి అని అనుకుంటుంది. మరొకవైపు జగతి దంపతులు కాలేజీకి వెళ్తూ ఉండగా మహేంద్ర సంతోషంతో సరదాగా జోకులు వేస్తూ ఉంటాడు.

అప్పుడు కారు పంచర్ అవ్వగా ఇంతలోనే అక్కడికి వచ్చిన రిషి నేను లిఫ్ట్ ఇస్తాను అని చెప్పి మహేంద్ర జగతిని ముందర సీట్ లో కూర్చోబెట్టి తాను వెనుక సీట్లో కూర్చుంటాడు. అప్పుడు జగతి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. మరొకవైపు వసు కాలేజీకి అని బయటిదేరగా ఆటోలు వెళ్తే డబ్బులు ఖర్చవుతాయి డబ్బులు మిగిల్తే సార్ కి రింగ్ చేయించాలి అనుకుంటుంది.

Guppedantha Manasu Aug 19 Today Episode : ఒకే కారులో జగతి దంపతులు వసు,రిషి..

అప్పుడు వసుధార నడుచుకుంటూ వెళ్తూ ఉండగా జగతి వసు నీ చూసి కారు ఆపుతుంది. అప్పుడు వస వెళ్లి రిషి పక్కన కూర్చుంటుంది. అప్పుడు మహేంద్ర కారు నడుపుతాను అని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చొని తెగ సంతోష పడుతూ హంగామా చేస్తూ ఉంటాడు. అప్పుడు కావాలనే పదేపదే బ్రేకులు వేస్తూ రిషి వసు ఒకరికి ఒకరు టచ్ అయ్యే విధంగా చేస్తూ ఉంటాడు.

ఆ తర్వాత కాలేజీకి వెళ్లిన వసుధార క్లాసు రూమ్ లో కూర్చుని రింగుకు ఎంత ఖర్చవుతుంది అని లెక్క వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి క్లాస్ కి వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉంటుంది. అప్పుడు రిషి బోర్డుపై ఒక ప్రాబ్లం వేసి దాన్ని వసు నీ సాల్వ్ చేయమని చెబుతాడు.

Advertisement

Read Also : Guppedantha Manasu Aug 18 Today Episode : దేవయానికి గోరుముద్దలు తినిపించిన రిషి.. ఆనందంతో పొంగిపోతున్న జగతి..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Guppedantha ManasujagathimahendraRishivasu
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు