G
Telugu News » TV Serials » rishi appreciates vasudhara in todays guppedantha manasu serial episode
⚡ TV Serials, Latest, Trending

Guppedantha Manasu july 21 Today Episode : సాక్షికి తగిన విధంగా బుద్ధి చెప్పిన వసు.. వసుధారకి పువ్వు ఇచ్చిన రిషి..?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ జూలై 21 ఎపిసోడ్ " నేను మిమ్మల్ని." అని రిషికి వసు ఏం చెబుతోంది, jagathi, sakshi, vasu, Rishi, gautham, ,telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Guppedantha Manasu july 21 Today Episode : తెలుగు బుల్లితెర ఫై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, సాక్షి ఇంట్లో వంట చేస్తాను అని చెప్పి లోపలికి వెళుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ అక్కడికి వచ్చి అసలు కిచెన్ లో వస్తువులు కూరగాయలు ఏమీ లేవు. వసుధర చాలా ప్రయత్నించింది కానీ ఏమి వంటలు చేయలేక పోయింది అని నిరాశతో చెబుతూ ఉంటాడు. అప్పుడు సాక్షి వసుధారని ఎలాగైనా అవమానించాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే వసు ఏమీ తెలియనట్టుగా అక్కడికి వస్తుంది.

Guppedantha Manasu july 21 Today Episode : rishi-appreciates-vasudhara in todays guppedantha manasu serial episode

రిషి జగతి దంపతులు కూడా ఏమి చేయలేదు అని అనుకుంటారు. అప్పుడు సాక్షి దొరికింది కదా ఛాన్స్ అని అందరి ముందు వసుని అవమానించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సాక్షి మాటలకు గౌతమ్ వసుధార ఒక్కసారిగా పకపక నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు అని అనగా వెంటనే గౌతమ్ రిషి దగ్గరికి వెళ్లి వసు వంట చేసిన విధానాన్ని మెనూని చెబుతూ గొప్పగా పోవడంతో జగతి దంపతులు ఆనంద పడుతూ ఉంటారు.

Advertisement

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ జూలై 21  ఎపిసోడ్ ” నేను మిమ్మల్ని…” అని రిషికి వసు ఏం చెబుతోంది…

అప్పుడు సాక్షి అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేయడానికి వెళ్లారు. అప్పుడు వసూలు చేసిన భోజనం తింటూ వసుని పొగడ్తలతో ముంచేత్తుతూ ఉంటారు. అది చూసి సాక్షి నా ఇంట్లో దీని పెత్తనం ఏంటో అనే కుళ్ళుకుంటూ ఉంటుంది.

అప్పుడు సాక్షి,వసు చేసిన వంటలను తప్పుపట్టగా వెంటనే రిషి సాక్షికి గట్టిగా కౌంటర్ ఇస్తాడు. ఇక అందరు తిని బయలుదేరిన తర్వాత మహేంద్ర వసుధారని ఎవరు డ్రాప్ చేస్తారు అనగా వెంటనే రిషి నేను చేస్తాను అనడంతో సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు వసు, సాక్షి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగగా వెంటనే రిషి నాకు సాక్షి మీద ఎటువంటి అభిప్రాయం లేదు అని అంటాడు.

ఎందుకు అలా అడిగావు అని అడగగా వెంటనే వసు సాక్షి తీస్తే డిన్నర్ కి వెళ్తారు కాఫీ కి వెళ్తారు అని ఫీల్ అవుతూ ఉండగా వెంటనే రిషి నా విషయంలో నాకు క్లారిటీ ఉంది నీ సంగతి ఏంటి చెప్పు అని అంటాడు. ల్యాబ్ లో ఎందుకు అలా మాట్లాడావు ఆ తర్వాత ఫంక్షన్ లో ఎందుకు పూలదండ వేసావు అని అడగగా వసుధార తన మనసులో మాట చెప్పబోతూ ఉండడంతో రిషి అడ్డుపడి నాకు తెలుసు నేనంటే నీకు గౌరవం అని చెబుతావు ఇంతే కదా నువ్వు చెప్పాల్సింది అనుకుని అపార్థం చేసుకుంటాడు.

ఆ తర్వాత పుష్ప, వసు ఇద్దరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు పుష్ప వసుధారని పొగుడుతుంది. ఇంతలో గౌతమ్ వచ్చి గౌతమ్ కూడా వసుధారని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత గౌతమ్ కి ఒక పని అప్పజెప్పడంతో గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పుష్పతో వసు మాట్లాడుతూ నేను అసిస్టెంట్ గా పనికిరానా పుష్ప అని అంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.

రిషి ని గమనించిన పుష్ప లేచి భయపడుతూ ఉండగా వసుధర మాత్రం రిషి ని గమనించకుండా మాట్లాడుతూనే ఉంటుంది. తర్వాత రిషి ని చూసి షాక్ అవుతుంది. అప్పుడు రిషి చదువుల పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా ఇంతలోకి పుష్ప ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి, వసు కోసం పువ్వు ఇస్తాడు.అది చూసి వసుధార ఆనంద పడుతూ ఉంటుంది.

Read Also : Guppedantha Manasu july 20 Today Episode : అందరి ముందు అడ్డంగా దొరికిపోయిన సాక్షి.. సాక్షిని ఒక రేంజ్ లో ఆటాడుకున్న గౌతమ్, వసు..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷gauthamGuppedantha ManasujagathiRishisakshivasu
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు