G
Telugu News » TV Serials » rishi acts fiercely as vasudhara misunderstands him in todays guppedantha manasu serial episode
⚡ TV Serials, Latest, Trending

Guppedantha Manasu serial Sep 28 Today Episode : వసుధార మీద కోపంతో రగిలిపోతున్న రిషి..బాధలో జగతి దంపతులు..?

Guppedantha Manasu serial September 28 Today Episode, Guppedantha manasu serial, guppedantha manasu 28-9-2022 serial, గుప్పెడంత మనసు సీరియల్, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Guppedantha Manasu serial September 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి దేవయాని వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని కావాలనే జగతిని నిందిస్తూ రిషి ముందు బ్యాడ్ చేయాలి అని చూస్తుండగా ఇంతలో మహేంద్ర కోపంతోవదిన మీరు ఈ విషయంలో తల దూర్చవద్దు ఇది మా సమస్య అని అంటాడు. అప్పుడు దేవయాని కావాలని దొంగ ఏడుపులు ఏడుస్తున్నట్లు నటిస్తూ అంటే ఇది మీ కుటుంబ సమస్య నేను పరాయిదాన్ని అంటున్నావా మహేంద్ర అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది.

Rishi acts fiercely as Vasudhara misunderstands him in todays guppedantha manasu serial episode

అప్పుడు రిషి , ఏంటి పెద్దమ్మ మీరు బాధపడకండి అంటూ ఓదారుస్తూ ఉండగా దేవయాని మరింత రెచ్చిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కోపంతో రగిలిపోతున్న రిషి కారు వేసుకుని వెళ్తాడు. మరొకవైపు వసు గుడిలో దేవుడితో తన బాధలు చెప్పుకుంటూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి కోపంగా మాట్లాడతాడు.

Advertisement

అప్పుడు జరిగిన విషయాల గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకోకు వసుధార అని చెప్పినా కూడా వసు మాత్రం వినిపించుకోకుండా ఎలా అయినా మీరు జగతి మేడంని అమ్మ అని పిలవాలి సార్ అని మాట్లాడడంతో రిషి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. జరగదు అనుకున్న విషయం ఎప్పటికైనా జరుగుతుంది ఆ నమ్మకం నాకు ఉంది సార్ అని అంటుంది.

Guppedantha Manasu serial  : వసుధార టెన్షన్..రిషి ముందు దేవయాని నటన..   

అప్పుడు మీ అమ్మగారు మీ మంచి కోసం ఎంతగా ఆలోచిస్తున్నారో తెలుసా సార్ అని అనగా వెంటనే చూసి నేను కూడా జగతి మేడం కోసం ఎన్నో మెట్లు దిగి వచ్చాను అని అంటాడు. నాకు జగతి మేడం అంటే గౌరవం ఉంది కానీ అమ్మ అని మాత్రం పిలవను అని అంటాడు రిషి. వసుధార మాత్రం నిన్ను ఎలా అయినా మీతో జగతి మేడంని అమ్మ అని పిలిపించి తీరుతాను అని అనడంతో ఎందుకు వసుధర చెప్పినా కూడా వినిపించుకోవు అని కోపంతో రగిలిపోయిన రిషి అక్కడే ఉన్న గంటను గట్టిగా కొడతాడు.

రిషి చేతికి గాయం అవడంతో వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వసు గాయం అయింది అని బాధపడుతున్న కూడా రిషి వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వరకు వైపు జగతి మహేంద్ర గౌతమ్ లో ఇంట్లో కూర్చుని ఉండగా వారు రిషి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరొకవైపు వసుధర రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ వసుధార, రిషి లకు ఫోన్ చేస్తాడు.

అప్పుడు రిషి నువ్వు గౌతమ్ ఫోన్ చేసినా కూడా ఇక్కడ జరిగిన విషయాలు ఏవి చెప్పొద్దు అని అంటాడు. అప్పుడు వసుధార పదేపదే హాస్పిటల్ కి వెళ్ళాము అని అనగా రిషి కోపంతో వసుధారని బస్ స్టాప్ లో దింపేసి ఇంటికి వెళ్ళిపో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కాలేజీకి ఉన్నట్లుగా ఊహించుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

ఆ తర్వాత రిషి ఒక సోఫాలో పడుకొని ఉండగా వసు అక్కడికి వచ్చి కట్టు కడుతూ ఉంటుంది. అప్పుడు మెలకువ వచ్చిన రిషి, ఏం చేస్తున్నావ్ వసు చేయి వదులు అని అంటాడు వసు మాత్రం చేయి వదలకుండా కట్టు కడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో వసుధర అని అనగా మీరు వెళ్తే నేను వెళ్తాను సార్ అని అంటుంది. వారిద్దరు కొద్దిసేపు ప్రేమగా వాదించుకుంటూ ఉంటారు.

Read Also : Guppedantha Manasu serial Sep 27 Today Episode : వసుపై కోప్పడిన జగతి.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకున్న జగతి..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷gauthamGuppedantha ManasujagathimahendraRishivasu
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు