Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam: హిమ మాటలు విని షాక్ అయిన జ్వాలా..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

సౌందర్య, ఆనందరావు లు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఆనందరావు హిమ పెళ్లితోనే ఇంట్లో ఆనందాలు వస్తాయి అని అనడంతో అప్పుడు సౌందర్య, సౌమ్య కనిపించే వరకూ హిమ పెళ్లి మాట ఎత్త వద్దని చెప్పింది అని గుర్తు చేస్తుంది. సౌందర్య మాటలకు ఆనందరావు బాధపడతాడు.

Advertisement

మరొకవైపు జ్వాలా, హిమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తింగరి ఓటి అమాయకురాలు ఎలా బతుకుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే డాక్టర్ సాబ్, తింగరి ని చూసిన ప్రతి సారీ నాకు బాలు బాగా కావాల్సిన వాళ్ళు అనిపిస్తుంది అనుకుంటూ జ్వాలా ఆలోచిస్తూ ఉంటుంది.

ఇంతలో బయట నుంచి చంద్రమ్మ, ఇంద్రుడు రావడంతో ఎందుకు ఇంత లేట్ అయింది ఎక్కడికి వెళ్లారు అంటూ వారిని నిలదీస్తుంది. అప్పుడు ఇంద్రుడు దొంగతనాలు మానేసాను అని చెప్పి వీపుకు పెట్టిన వార్తలను వాళ్లకు చూపించడంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. మరొక వైపు హిమ శ్రీరామ్ నగర్ బస్తీ కి వెళుతుంది.

అక్కడ తన తల్లిదండ్రుల జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. అనంతరం కార్తీక్ ఫోటో ఎదుట దీపం వెలిగించి నన్ను క్షమించండి డాడీ అని ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు జ్వాలా కూర్చుని ఉండగా ఇంతలో ఒక అతను వచ్చి శ్రీరామ్ నగర్ బస్తీ కి వెళ్లాలి వస్తావా అని అడుగుతాడు.

Advertisement

అప్పుడు సౌర్య ఆనందంతో సరే అని అంటుంది. ఇక బస్తీ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆటోలో ఇచ్చిన అతన్ని లక్ష్మణ్ వారణాసి గురించి మీకు తెలుసా అని అడుగుతుంది. మరోవైపు హిమ, బస్తీలో తన తండ్రి ఫోటో ముందు ఏడుస్తూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న సౌర్య ముందు వాళ్లు ఉన్న ఇంట్లో లైటు వెలుగుతుండటంతో లోపలికి వెళ్లి చూస్తుంది.

అక్కడ హిమ ను చూసి ఒక్క సారిగా షాక్ అవుతుంది. హిమ మాటలు విన్న సౌర్య ఒక్కసారిగా షాక్ తో అలాగే నిలబడి పోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Exit mobile version