G
Telugu News » TV Serials » janaki gets upset about madhavas marriage in todays devatha serial episode
⚡ TV Serials, Latest, Topstory

Devatha june 1 Today Episode : చిన్మయి విషయంలో బాధపడుతున్న రాధ.. ఆదిత్య మాటలకు షాక్ అయిన సత్య..?

Devatha: తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Devatha june 1 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సత్య, కమల ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో సత్య, కమల దగ్గరికి వచ్చి బయటకు వెళ్తున్నాను అని చెప్పగా ఆ విషయం ఆదిత్యకు చెప్పు అని అంటుంది సత్య. అప్పుడు కమల తనని చూసి సత్య బాధ పడుతుందేమో అని తన ఇంటికి పోవాలి అని అనుకుంటుంది. కానీ సత్య మాత్రం అలా ఏం కాదు నువ్వు ఇక్కడ ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని అంటుంది.

Advertisement
Devatha june 1 Today Episode

మరొకవైపు జానకి, రామూర్తితో మాట్లాడుతూ రాధ ప్రవర్తన ఏమీ బాగోలేదు అని అంటుంది. మాధవ కు రాధ అంటే ఇష్టం అని తెలిసి కూడా రాధ బయట బంధం చూసింది అని కోప్పడుతుంది. అప్పుడు రామ్మూర్తి అందులో రాద తప్పులేదు కదా తను మొదటి నుంచి అలాగే ఉంది, కాని రాధను మనం కోడలిగా చేసుకోవడం స్వార్థం అవుతుంది అని అంటాడు.

మరొకవైపు సత్య బయటికి వెళ్లిన విషయాన్ని ఆదిత్య తో కమల చెబుతుంది. ఆదిత్య ఒక చోట కూర్చొని రాధ ని తలుచుకుంటూ దేవి ఫోటోలు చూసుకుంటూ ఉంటాడు. ఇక జానకీ మాటలు విన్న రాధ కోపంతో కనిపిస్తుంది ఇంతలో అక్కడికి సత్య రావడంతో కొద్దిసేపు సత్యతో మాట్లాడుతుంది. అప్పుడు సత్య తనకు జీవితంలో అమ్మ అయ్యే అదృష్టం లేదు అని చెప్పడంతో రాధ బాధ పడుతుంది.

అప్పుడు సత్యకు ఏమీ కాదు అని ధైర్యం చెబుతుంది. ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండమని చెబుతూ తన మనసులో నా బిడ్డ నీ బిడ్డనే అని తొందర్లోనే కలుస్తాము అని అనుకుంటుంది రాధ. మరొక వైపు భాగ్యమ్మ తన కూతుళ్ల పరిస్థితి తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. రాధా వంటగదిలో ఉండగా అక్కడికి చిన్మయి వచ్చి ఎందుకు అలా ఉంటున్నావు అని అడగగా రాదా ఏమీ లేదు అని సర్ది చెబుతుంది.

ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము అనుకుంటే నీతో నా అనుబంధం మరింత బలంగా ఉంది అని బాధపడుతుంది రాధ. ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య రాధ ఇంటికి వెళ్లిన విషయాన్ని ఆదిత్యతో చెప్పడంతో అప్పుడు ఆదిత్య రాధా మీ అక్క రుక్మిణి అని తెలిసి వెళ్ళావు కదా అని అనడంతో సత్య అవుతుంది. ఆ విషయం తనకు కూడా తెలుసు అని ఆదిత్య అనడంతో మరింత షాక్ అవుతుంది సత్య. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Devatha May 31 Today Episode : మాధవకు పెళ్లిచూపులు ఏర్పాటుచేసిన రాధ.. ఆనందంలో ఆదిత్య..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Devathajanakimadhavaradha
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు