Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu Nov 1 Today Episode : దగ్గరవుతున్న వసుధార రిషి.. మహేంద్ర రిషి ని కలిపి ప్రయత్నంలో గౌతమ్..?

Guppedantha Manasu Nov 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు,రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధార ఇద్దరు సంతోషంగా కారులో వెళుతూ ఉంటారు. అప్పుడు వసుధార అన్న మాటలు తలుచుకొని ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకున్నాను వసుధార అని సంతోషపడుతూ ఉంటాడు. వసుధార కూడా రిషి వైపు చూస్తూ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధార ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ క్షణంలో డాడ్ వాళ్లు ఉంటే ఇంకా బాగుండేది అని అంటాడు. తర్వాత రిషి తలపై ఉన్న గులాబీ రెక్కను వసుధార తీసుకొని నీకు ఎంత ధైర్యం అని అనడంతో వెంటనే రిషి ఆ గులాబీ పువ్వు రెక్కలు తీసుకుని జోబులో పెట్టుకుని దాని అందమైన జ్ఞాపకంగా దాచుకుంటాను వసుధార అనటంతో వసు సంతోషపడుతూ ఉంటుంది.

Guppedantha Manasu Nov 1 Today Episode

అప్పుడు వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు గౌతమ్ రిసీపడుతున్న బాధలు అన్నీ మహేంద్ర వాళ్లకు చెబుతూ ఉండటంతో మహేంద్ర వాళ్ళుబాధపడుతూ ఉంటారు. అప్పుడు గౌతమ్ ప్లీజ్ అంకుల్ తిరిగి వచ్చేయండి అక్కడ రిషి బాధను చూడలేకపోతున్నాను మీరు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకంటే మీకే బాగా తెలుసు అని అంటాడు గౌతం. కానీ మహేంద్ర మాత్రం రాలేను గౌతం అని అంటాడు. కానీ ఎందుకు ఏమిటి అని మాత్రం అడగకండి అని అంటాడు మహేంద్ర. మేము దూరంగా ఉంటేనే కదా గౌతమ్ వారిద్దరు దగ్గర అయ్యేది అని మనసులో అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. అప్పుడు జగతి గౌతమ్ ఎంత నచ్చడానికి ప్రయత్నించిన కూడా మహీంద్రా వినిపించుకోడు.

Advertisement

అప్పుడు గౌతమ్ అంకుల్ అక్కడ దేవయాని పెద్దమ్మ మౌనంగా ఉన్నారు అని అనుకోకండి ఆమె ప్లాన్లు చేస్తున్నారు. ఆమె నుంచి మనకు ఏదో ఒక సమస్య రాకముందే మీరు అక్కడికి వచ్చేయండి అని అనడంతో వెంటనే మహేంద్ర గౌతమ్ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. మేము ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత వసుధర మనసులో ఏమైనా మార్పులు వచ్చాయో ఆలోచనలో ఏమైనా మార్పులు వచ్చిందేమో అడిగి నాకు చెప్తావా అని అంటాడు మహేంద్ర. సరే అని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వసుధార కాలేజీలో పరిగెడుతూ ఉండగా వెనకాలే రిషి ఆగు వసుధార అంటూ పరిగెడుతూ ఉంటాడు.

ఇంతలోనే రిషి కాళ్ల కింద వసుధార చున్నీ పడిపోవడంతో ఇద్దరూ ఒక సరిగా హత్తుకుంటారు. అప్పుడు రిషి ఒక్క నిమిషం ఆగు వసుధార నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని గిఫ్ట్ ఇవ్వడంతో మీరే నాకు పెద్ద గిఫ్ట్ సార్ అని ఉంటుంది. ఆ తర్వాత ఓన్లీ థాంక్స్ ను మాత్రమేనా ఇంకా ఏమైనా ఉందా అని రిషి అనడంతో వసుధర ఒక్కసారిగా గట్టిగా చేసుకుంటుంది. అప్పుడు రిషి కూడా వసుధారని గట్టిగా హత్తుకుంటాడు. అదంతా ఊహించుకుంటూ ఉంటుంది దేవయాని. రిషి వసుధార కౌగిలించుకున్నట్టుగా ఊహించుకొని భయపడి పోయిన దేవయాని తొందరలో ఎలా అయినా ఇది జరగవచ్చు కాబట్టి వారిద్దరిని తొందరగా విడగొట్టాలి అని అనుకుంటూ ఉంటుంది దేవయాని.

Guppedantha Manasu నవంబర్ 1 ఎపిసోడ్ : వసుధార షాక్..

ఏం చేయాలి ఎలా చేసే వారిని విడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు కాలేజీలో ఉన్న రిషి ఎక్కడికి వెళ్లారు డాడ్ అంటూ మహేంద్ర గురించి తలుచుకొని మహేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. తర్వాత వసుధార కి ఎక్కడ ఉన్నా వసుధార తొందరగా మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్ తీసుకుని రా అని చెబుతాడు. అప్పుడు వసుధార కాలేజీకి వస్తూ ఉండగా ఇంతలో కాలేజీలో ఒక మేడం వసుధార ఆపి.. వసుధార జగతి మేడం మహేంద్ర సార్ ఇంటి నుంచి వెళ్లిపోయారంట కదా అయినా ఒకటే కుటుంబం అంటారు అలా ఎలా విడిపోయారో తెలియదు అంటూ ఆమె వెటకారంగా మాట్లాడడంతో వసుధర కోప్పడుతూ ఉంటుంది.

Advertisement

దేవయాని మేడం చెప్పారు అని అనడంతో వసుధార షాక్ అవుతుంది. మరొకవైపు రిషి ఒంటరిగా ఉండడంతో అక్కడికి గౌతమ్ వస్తాడు. అప్పుడు రిషి ఎంతో ఆశగా గౌతమ్ ని తన తల్లిదండ్రుల గురించి అడగడంతో లేదు అని అంటాడు గౌతమ్. అప్పుడు రిషి బాధని చూడలేక గౌతమ్ మౌనంగా ఉంటాడు. ఇలా అయిన డాడ్ వాళ్ళని వెతకాలి వెతికితే కనబడితే నిలదీయాలి అనడంతో వెంటనే వసుధర అక్కడికి వచ్చి అవును సార్ ఎక్కడ కనపడితే అక్కడ నిలదీయాలి అనడంతో వెంటనే రిషి ఏం జరిగింది వస్తదా రా ఎందుకు అలా అంటున్నావు అనడంతో మహేంద్ర సార్ జగతి మేడం గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు సార్ అని అంటాడు.

వాళ్లకు ఎలా తెలిసింది అనడంతో దేవయాని మేడం చెప్పారు అనడంతో వెంటనే రిషి షాక్ అవుతాడు. దేవయాని మేడం అలా చెప్పి ఉండకూడదు సార్ అని అనడంతో వెంటనే రిషి కోపంతో పెద్దమ్మ చెప్పింది కరెక్టే వసుధారా అంటూ వసుధార మీద సీరియస్ అవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గౌతమ్ రిషి ఇద్దరు నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఇంతలో గౌతమ్ వసుధార మీద సీరియస్ అయ్యావు తప్పు కదరా అని అంటాడు. అలాగే జగతి మహేంద్ర ల గురించి ఆలోచిస్తూ ఈ విషయాన్ని అందరికీ నేనే చెబుతాను అని అంటాడు.

Read Also : Guppedantha Manasu Oct 31 Today Episode : రిషికి సారి చెప్పిన వసు.. ఒకరిపై ఒకరు పూల వర్షం కురిపించుకున్న వసురిషి..?

Advertisement
Exit mobile version