Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Devatha: సాక్షాదారాలతో దేవి దగ్గరకు వెళ్లిన ఆదిత్య..రుక్మిణి ఏం చేయనుంది..?

Devatha: బుల్లితెర ఫై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదిత్య, రాధ తో మాట్లాడాలి అని ఫోన్ చేయగా అప్పుడు రాద ఏం చెప్పాలి చెప్పాల్సింది అంత చెప్పేసిన కదా అని అనగా.. అప్పుడు ఆదిత్య నాకు ఒక కల వచ్చింది. అందులో దేవీ నన్ను నాన్న అని గట్టిగా హగ్ చేసుకుంది అనే కల గురించి వివరిస్తాడు. దేవిని నాకు ఇచ్చేయ్ రాధ,నువ్వు దేవిని ఇస్తే నేను ఒక్కడినే కాదు మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అని అంటాడు ఆదిత్య.

Advertisement
Guppedantha Manasu : భయంతో వణికిపోతున్న శైలేంద్ర…ముకుల్‌ ముందు నిజం చెప్పిన ధరణి!

అప్పుడు రాధ అవన్నీ జరగాలంటే నా ప్రాణం పోవాలి ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి అంటూ బోరున ఏడుస్తుంది. అప్పుడు ఆదిత్య అవన్నీ నాకు తెలియదు నేను నిజం చెప్పేస్తాను.. నువ్వు ఈరోజు దేవుని స్కూల్ దగ్గరకు తీసుకుని రా అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రుక్మిణి తాను పెళ్లి చేసుకున్న పెళ్లి ఫోటోలను బ్యాగులో పెట్టుకుంటాడు ఆదిత్య.

నేనే నీ తండ్రిని అని నమ్మించడానికి ఇలా సాక్ష్యాలతో రావాల్సి వస్తోంది అమ్మ దేవి అంటూ ఎమోషనల్ అవుతాడు ఆదిత్య. సత్య దగ్గరికి వెళ్లి సత్య ఈరోజు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ప్రతిరోజూ పండగే అని చెప్పి దేవుడమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతాడు. మరొక వైపు రాధ ఆదిత్య అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.

ఇంతలో మాధవ అక్కడికి వచ్చి పిల్లలు రెడీనా స్కూల్కి తీసుకెళ్తాను అని అంటాడు. అప్పుడు రాద ఈరోజు స్కూల్ కి ముద్దుబిడ్డ మీతోనే ఇంట్లో ఉండాలని ఉంది అని అబద్ధం చెప్పి వాళ్ళని స్కూల్ కి వెళ్ళకుండా ఆపేస్తుంది. మరొకవైపు ఆదిత్య పెళ్లి ఫోటోలను చూసుకుంటూ దేవికి ఎలా అయినా నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో కారులో నుంచి రాధ దిగుతుంది.

Advertisement
Guppedantha Manasu ఫిబ్రవరి 2 ఎపిసోడ్ : రిషికి నిజం చెప్పాలి అనుకున్న చక్రపాణి.. కొత్త ప్లాన్ వేసిన దేవయాని?

నువ్వు పిల్లల్ని తీసుకురాకపోతే నేను ఇంటికి వెళ్లి కలవలే నా.. నేను ఇంటికి వెళ్లి కలుస్తాను అంటూ ఆవేశంగా బయలుదేరిన ఆదిత్యకు పెనిమిటి నిన్ను దేవమ్మ తప్పుగా అర్థం చేసుకుంది అని చెబుతుంది.

ప్రతి రోజు నువ్వు నాకోసం వస్తున్నావు అని అనుకుంటుంది ఈ సమయంలో నువ్వు ఫోటోలు చూపిస్తే ఇంకా తప్పుగా అనుకుంటుంది అని చెప్పి షాక్ ఇస్తోంది రాధ. అలా మొత్తానికి రాద ఆదిత్య నువ్వు దేవి దగ్గరకు వెళ్ళకుండా చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Guppedantha Manasu ఫిబ్రవరి 01 ఎపిసోడ్ : రిషిని చూసి బాధపడుతున్న జగతి.. దగ్గరవుతున్న వసు రిషి?
Exit mobile version