G
Telugu News » Trending » heart touching scene daughters carry fathers bier to cremation ground
⚡ Trending

Heart-Touching Scene : హార్ట్ టచ్చింగ్ సీన్.. కూతుళ్లే కొడుకులా తండ్రి అంతిమ సంస్కారాలు.. నలుగురు భుజాన పాడే మోస్తూ కన్నీటి వీడ్కోలు..

Heart-Touching Scene : తండ్రి అంతిమ సంస్కారాలను కుమారుల్లాగే పూర్తి చేశారు. నలుగురు కూతుళ్లు తండ్రె పాడెను స్వయంగా భుజాలపై మోశారు.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Heart-Touching Scene : పేరుకే కూతుళ్లు.. కానీ, కొడుకు చేయాల్సిన అంతిమ సంస్కారాలు ముందుండి నడిపించారు. ఈ నలుగురు కూతుళ్లు తమ తండ్రి పాడెను మోస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో జరిగింది.

నరసాపురం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు (75) అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత శనివారమే ఆయన ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.

Advertisement

తండ్రికి ఆ గ్రామంలో మంచి పేరు ఉంది. ఎలాంటి సాయం అడిగినా అన్ని తానై ముందుండి నడిపించేవారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా అందరి మధ్య నుంచి వెళ్లిపోవడంతో ఆ ఊరు శోకసంద్రంలో మునిగిపోయింది.

Read Also : PM Kisan 22nd Installment : రైతులకు అలర్ట్ : ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 22వ విడత రూ. 2,000 ఖాతాలో ఎప్పుడొస్తుంది?

ఆయనకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు లేని లోటును తీర్చేందుకు ఆయన చివరి కర్తవ్యాన్ని నిర్వహించారు. నలుగురు కూతుళ్లు ముందుకు వచ్చి తండ్రె పాడెను స్వయంగా భుజాలపై మోస్తూ తీసుకెళ్లారు.

Heart-Touching Scene : తండ్రి అంతిమ సంస్కారాలు చేసిన కూతుళ్లు :

తండ్రి పాడెను మోస్తున్న నలుగురు కూతుళ్లను చూసిన ఆ ఊరి జనమంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఊరు ఊరు మొత్తం కన్నీటితో సాగనంపారు. తండ్రి అంతిమ సంస్కారాలను కుమారుల్లాగే పూర్తి చేశారు. తమకు తండ్రి పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను గుర్తు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు.

సాధారణంగా ఆడపిల్లలు కుటుంబానికి భారంగా భావిస్తుంటారు. కానీ, అదే కుటుంబానికి ఈ నలుగురు ఆడపిల్లలు అండగా నిలిచారు. కొడుకు లేడనే లోటును తీర్చడమే కాకుండా కనిపెంచిన తండ్రికి తమ వంతు బాధ్యతగా కడదాకా పాడె మోస్తూ తమ తండ్రి రుణాన్ని తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Cremation GroundDaughters Become Sons:Emotional FarewellHeart-Touching Scene
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు