Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

UPI Outage : భారత్‌లో స్తంభించిన యూపీఐ సర్వీసులు.. ఆగిపోయిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్..!

UPI outage hits India
UPI outage hits India

UPI outage hits India : భారత్‌లో యూపీఐ సర్వీసులు డౌన్ అయ్యాయి. దేశవ్యాప్తంగా UPI సేవలు నిలిచిపోయాయి. యూపీఐ యూజర్లు పేమెంట్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూపీఐ సర్వీసులు స్తంభించినట్టు సోషల్ మీడియా వేదికగా యూపీఐ యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

యూపీఐ పేమెంట్లు చేయడంలో సమస్యలు ఎదురువుతున్నట్టు వాపోతున్నారు. ఇప్పటికే వేలాది మంది యూపీఐ యూజర్లు ఫిర్యాదులు చేశారు. వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. రాత్రి 7 గంటల తర్వాత యూపీఐ పేమెంట్లపై ఫిర్యాదులు పెరిగాయి. ఈ సంఖ్య 3 వేలు దాటింది.

ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్స్ యాప్‌లు పనిచేయడం లేదని యూజర్లు వాపోతున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో కూడా తమ సమస్యలను వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో NPCI స్పందించలేదు. ప్రతిరోజూ లక్షలాది UPI లావాదేవీలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో, యూపీఐ పేమెంట్లలో సమస్యలను ఎదుర్కోవడంతో ఇబ్బందికరంగా మారింది.

Advertisement

Read Also :  Realme P3 Ultra 5G : రియల్‌‌మి P3 అల్ట్రా 5జీ ఫస్ట్ సేల్ మీకోసం.. ఏకంగా రూ.3వేలు తగ్గింపు.. ఆర్డర్ పెట్టుకోండి!

ఈరోజు సాయంత్రం నుంచి యూపీఐ యూజర్లు UPI పేమెంట్లలో సమస్యలను రిపోర్టు చేయడం ప్రారంభించారు. చాలా మంది యూపీఐ పేమెంట్లు చేయలేకపోయారు.

GooglePay, PhonePe Paytm వంటి డిజిటల్ యాప్‌లు కూడా పనిచేయడం లేదని వినియోగదారులు సోషల్ మీడియాలో నివేదించారు. చాలా మందికి ఈ సమస్య తమకు మాత్రమే వస్తుందా లేక అందరి యూజర్లకు కూడా ఉందా? అనేది అర్థం కాలేదు. యూపీఐ పేమెంట్ సిస్టమ్ నిర్వహిస్తున్న NPCI దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

అందిన సమాచారం ప్రకారం.. యూపీఐ సర్వీసులు మళ్లీ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

Exit mobile version