Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Samsung Galaxy S24 Ultra 5G : వావ్.. అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్ భయ్యా.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్..

Samsung Galaxy S24 Ultra 5G

Samsung Galaxy S24 Ultra 5G

Samsung Galaxy S24 Ultra 5G : అమెజాన్ అతిపెద్ద సేల్ ప్రైమ్ డే సేల్ జూలై 12 నుంచి (Amazon Prime Day Sale) ప్రారంభమైంది. 3 రోజుల షాపింగ్ ఈవెంట్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, అమెజాన్ డివైజ్‌లతో సహా అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ (Samsung Galaxy S24 Ultra 5G) సభ్యులకు మాత్రమే ప్రత్యేకమైనది. ముందస్తు డీల్స్, కొత్త లాంచ్‌లు, లిమిటెడ్ ఆఫర్‌లను కలిగి ఉంటుంది.

ఈ సేల్‌లో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం ‘అతిపెద్ద డీల్ ఆఫ్ ది సేల్’ను వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G రూ.74,999 ఆఫర్ ధరకు అందుబాటులో ఉంది.

Samsung Galaxy S24 Ultra 5G ధర రూ.74,999 :

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా గత ఏడాదిలో రూ.1,34,999 (బేస్ మోడల్) ధరతో లాంచ్ అయింది.  అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ (Amazon Prime Day Sale Offers)లో ఈ హ్యాండ్‌సెట్ రూ.60వేల తగ్గింపుతో లభిస్తుంది. వినియోగదారులు రూ.74,999కి కొనుగోలు చేయొచ్చు.

Advertisement
Samsung Galaxy S24 Ultra 5G

అమెజాన్ ప్రైమ్ డే సేల్ బ్యాంక్ ఆఫర్లు :

Samsung Galaxy S24 Ultra 5G ఫీచర్లు :

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ 6.8-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. చిన్ సహా చుట్టూ నారో బెజెల్స్‌తో 2600 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. గెలాక్సీ S24 సిరీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ గ్లాస్ అత్యంత మన్నికైనది. రిప్లక్షన్స్ 75శాతం తగ్గిస్తుంది. వివిధ లైటింగ్ పరిస్థితులలో అద్భుతమైన వ్యూను అందిస్తుంది. అదనంగా, డిస్‌ప్లే విజన్ బూస్టర్‌కు సపోర్టు ఇస్తుంది. 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

Read Also : Acer Aspire Go 14 : స్టూడెంట్స్ కోసం కొత్త AI ల్యాప్‌టాప్‌.. అతి చౌకైన ధరకే ఏసర్ ఆస్పైర్ గో 14 కొనేసుకోండి!

Galaxy S24 Ultra ఫోన్ Snapdragon 8 Gen 3 మొబైల్ ప్లాట్‌ఫామ్, Galaxy AI సూట్ ద్వారా అడ్వాన్స్ AI ఫీచర్లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5x ఆప్టికల్ జూమ్, OISతో కూడిన కొత్త 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. OISతో కూడిన 200MP ప్రైమరీ వైడ్ కెమెరా, OISతో కూడిన 10MP 3x టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీల కోసం, డ్యూయల్-పిక్సెల్ 12MP సెన్సార్ ఉంది.

Advertisement

ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ UI 6.1పై రన్ అయ్యే గెలాక్సీ S24 అల్ట్రా 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. 5000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్‌కు సపోర్టు ఇస్తుంది.

Exit mobile version