POCO M7 Plus : పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో M7 ప్లస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ పోకో ఫోన్ M6 ప్లస్ అప్‌గ్రేడ్ వెర్షన్. బ్రాండ్ లేటెస్ట్ ఫోన్ FHD+ డిస్‌ప్లే (POCO M7 Plus) కలిగి ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో సెంటర్ పంచ్ హోల్ కటౌట్ ఉంది.
ఈ ఫోన్ అతిపెద్ద డిస్‌ప్లే కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB వరకు ర్యామ్ ఉంది. 50MP బ్యాక్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా HyperOSలో రన్ అవుతుంది. ధర, ఇతర వివరాలను ఓసారి తెలుసుకుందాం.
POCO M7 Plus : పోకో స్పెసిఫికేషన్లు ఏంటి? :
పోకో M7 ప్లస్ 5G ఫోన్ 6.9-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. స్క్రీన్ టాప్ బ్రైట్‌నెస్ 550 నిట్స్, ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 6GB ర్యామ్, 8GB ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. 128GB స్టోరేజీ కూడా ఉంది.
మైక్రో SD కార్డ్ సాయంతో 1TB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్ OSపై రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. కంపెనీ ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. 7000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది.
POCO M7 Plus : ధర ఎంతంటే? :
మీరు పోకో M7 ప్లస్ 5G ఫోన్ క్రోమ్ సిల్వర్, అక్వా బ్లూ, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ అయింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999కు పొందవచ్చు. అదే సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999కు పొందవచ్చు.
ఆగస్టు 19 నుంచి మీరు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్‌గా కంపెనీ HDFC, ICICI బ్యాంక్, SBI కార్డులపై రూ. 1000 తగ్గింపు అందిస్తోంది. అదనంగా రూ. 1000 ఎక్స్ఛేంజ్‌ను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ నో-కాస్ట్ ఈఎంఐలో కూడా అందుబాటులో ఉంటుంది.