New UPI Rules : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త యూపీఐ రూల్స్ రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) కోసం కొత్త రూల్స్ (New UPI Rules) అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
కొన్ని సందర్భాల్లో రోజువారీ యూపీఐ యూజర్లపై కూడా ప్రభావం పడుతుంది. ఈ కొత్త రూల్స్ ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. NPCI ప్రకారం.. ఈ కొత్త రూల్స్ దేశంలో UPI లావాదేవీల విశ్వసనీయత, భద్రత, వేగాన్ని పెంచడంలో సాయపడతాయి.
ఈ రూల్స్ ప్రకారం.. Paytm, Google Pay, PhonePe లేదా ఏదైనా ఇతర UPI పేమెంట్ యాప్‌ను ఉపయోగించే వినియోగదారులందరికి వర్తిస్తాయి. ఈ కొత్త రూల్స్ ప్రధానంగా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో పేమెంట్లు చేయడం, లావాదేవీలు చేయడం, ఆటోపేలు, బ్యాలెన్స్ చెకింగ్ చేసేవారిపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది.
New UPI Rules : ఆగస్టు 1 నుంచి కొత్త UPI రూల్స్ ఇవే :
- ఇప్పుడు, అందరు వినియోగదారులు ఒక ఫోన్ నంబర్‌తో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లను రోజుకు గరిష్టంగా 25 సార్లు చెక్ చేయగలరు.
- వినియోగదారులు రోజుకు 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసేందుకు అనుమతి ఉంటుంది.
- వినియోగదారులు ఒక పేమెంట్ స్టేటస్ 3 సార్లు మాత్రమే చెక్ చేయగలరు
- ప్రతిసారీ చెకింగ్ కోసం కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాలి.
- వివిధ ప్లాట్‌ఫామ్‌లలో Autopay లావాదేవీలకు నిర్ణీత సమయ పరిమితులు ఉంటాయి.
NPCI కొత్త రూల్స్ ఎందుకంటే? :
ఈ ప్లాట్‌ఫామ్‌లపై మోసాలను అరికట్టేందుకు UPI సులభతరం చేసేందుకు NPCI కొత్త రూల్స్ తీసుకువస్తోంది. కొత్త డేటా ప్రకారం.. భారత్‌లో ప్రతి నెలా దాదాపు 6 బిలియన్ UPI లావాదేవీలు జరుగుతాయి. ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఏప్రిల్, మే 2025 మధ్య చెల్లింపులు లేదా పొందడంలో అంతరాయాలు, జాప్యాలకు సంబంధించిన ఫిర్యాదులు పెరిగాయి.
చాలా మంది వినియోగదారులు నిరంతరం బ్యాలెన్స్‌ను చెక్ చేయడం లేదా పేమెంట్ స్టేటస్ నిమిషాల పాటు పదేపదే చెక్ చేయడం దీనికి ప్రధాన కారణమని NPCI చెబుతోంది. దాంతో యూపీఐ సిస్టమ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది.
ఫలితంగా లావాదేవీల స్పీడ్ తగ్గుతోంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు NPCI కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. ఈ కొత్త రూల్స్ ప్రభావం వినియోగదారులపై పెద్దగా ఉండదనే చెప్పాలి.