Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Harley-Davidson : ఇలాంటి బైకులు కొనాలి భయ్యా.. హార్లే-డేవిడ్సన్ బైక్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఫీచర్లు, లుక్స్ కేక!

Harley-Davidson : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. బుల్లెట్ బైక్ లవర్స్ అయితే ఇది మీకోసమే. మీరు హార్లే-డేవిడ్సన్ ఖరీదైన బైక్‌లంటే ఇష్టమా? వాస్తవానికి, హార్లే-డేవిడ్సన్ (Harley-Davidson) రెండు మోటార్ సైకిళ్ళపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్, ఫ్యాట్ బాబ్ లపై ఆగస్టు 2025లో తగ్గింపు ధరకే అందిస్తోంది.

మీరు హార్లే-డేవిడ్సన్ వంటి ఖరీదైన బైక్‌లను ఇష్టపడితే.. ఇప్పుడే కొనేసుకోండి. వాస్తవానికి, హార్లే-డేవిడ్సన్ ఆగస్టు 2025లో రెండు మోటార్ సైకిళ్ళు హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్, ఫ్యాట్ బాబ్‌లపై (Harley-Davidson Fat Boy And Fat Bob) భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ రెండూ క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు, అనేక ఫీచర్లతో వస్తాయి. ఇది మాత్రమే కాదు, ఇంజిన్ చాలా పవర్‌ఫుల్. ఈ 2 మోటార్‌సైకిళ్లపై అందుబాటులో ఉన్న ఆఫర్లు, ధర ఫీచర్లకు సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం..

Harley-Davidson : హార్లే-డేవిడ్సన్ బైక్‌పై డిస్కౌంట్ :

హార్లే-డేవిడ్సన్ పవర్‌ఫుల్ బైక్‌లు ఫ్యాట్ బాయ్, ఫ్యాట్ బాబ్‌లపై ఆగస్టు 2025లో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్ల 2024 మోడళ్లపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని షోరూమ్‌లలో అదనపు ఆఫర్‌లతో రూ. 3 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ బైక్‌లు పవర్‌ఫుల్ ఇంజిన్‌లు, ప్రీమియం ఫీచర్లు మెరుగైన పర్ఫార్మెన్స్ పొందవచ్చు.

Advertisement

Harley-Davidson : హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ ఫీచర్లు :

ఫీచర్ల విషయానికి వస్తే.. ఫుల్ LED లైటింగ్ సెటప్‌ కలిగి ఉంది. ఇందులో లో బీమ్, హై బీమ్, సిగ్నేచర్ పొజిషన్ లైట్ ఉన్నాయి. అలాగే, ఇంటిగ్రేటెడ్ మల్టీ-ఫంక్షన్ LED స్టాప్/టెయిల్/టర్న్ సిగ్నల్స్, ఇన్కాండిసెంట్ బుల్లెట్ టర్న్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. ఈ బైక్‌లో 4-అంగుళాల అనలాగ్ టాకోమీటర్ ఉంది. డిజిటల్ స్పీడోమీటర్, గేర్ ఇండికేటర్, ఓడోమీటర్, ఫ్యూయిల్ లెవల్, వాచ్, ట్రిప్ రేంజ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

Read Also : Hyundai Alcazar : మీ ఫ్యామిలీ కోసం 7 సీట్ల SUV కారు.. హ్యుందాయ్ అల్కాజార్ SUVపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఈ పవర్‌ఫుల్ బైక్‌లో 1,868cc మిల్వాకీ-ఎయిట్ 117CI ఇంజిన్ ఉంది. 93HP పవర్, 155Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2024 హార్లే-డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ భారత మార్కెట్లో రూ. 49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అమ్ముడవుతోంది. అయితే, ఈ మోడల్ 2025 నుంచి నిలిపివేసింది. ఇప్పుడు స్ట్రీట్ బాబ్ ద్వారా రిప్లేస్ చేస్తుంది.

Advertisement
Harley-Davidson Fat Bob vs Fat Boy price drop

హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ ఫీచర్లు :

పూర్తిగా LED హెడ్‌లైట్‌తో వస్తుంది. ఇందులో లో బీమ్, హై బీమ్, స్పెషల్ సిగ్నేచర్ పొజిషన్ లైటింగ్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్, మల్టీ-ఫంక్షనల్ LED స్టాప్/టెయిల్/టర్న్ సిగ్నల్స్ ఇన్కాండిసెంట్ బుల్లెట్ టర్న్ సిగ్నల్స్ కూడా పొందుతుంది. ఈ బైక్ గేర్, ఓడోమీటర్, ఇంధన స్థాయి, వాచ్, ట్రిప్, రేంజ్ టాకోమీటర్ డేటాను చూపించే డిజిటల్ డిస్‌ప్లేతో 5-అంగుళాల అనలాగ్ స్పీడోమీటర్‌ను పొందుతుంది.

2 సిలిండర్, 1,868cc, మిల్వాకీ-ఎయిట్ 114 ఇంజిన్‌ ఉపయోగిస్తుంది. 94hp పవర్, 155mm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2024 హార్లే డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ బైక్‌ను భారత మార్కెట్లో రూ.25.69 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందిస్తున్నారు. 2025 మోడల్ కన్నా రూ.21వేలు మాత్రమే తక్కువకు పొందవచ్చు.

Advertisement
Exit mobile version