Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Acer Aspire Go 14 : స్టూడెంట్స్ కోసం కొత్త AI ల్యాప్‌టాప్‌.. అతి చౌకైన ధరకే ఏసర్ ఆస్పైర్ గో 14 కొనేసుకోండి!

Acer Aspire Go 14 Launched in India Telugu

Acer Aspire Go 14 Launched in India Telugu

Acer Aspire Go 14 : ఏసర్ ఆస్పైర్ గో 14 ల్యాప్ టాప్ లాంచ్ అయింది. కంపెనీ అత్యంత సరసమైన AI-ఆధారిత ల్యాప్‌టాప్‌ భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. విద్యార్థులు, హోం యూజర్లు లేదా మొదటిసారి కొనేవారికి బెస్ట్‌ల్యాప్‌టాప్. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ CPUతో వస్తుంది. 65W USB-C అడాప్టర్‌తో పాటు 55Wh మూడు-సెల్ బ్యాటరీకి సపోర్టు ఇస్తుంది. Acer Aspire Go 14 ల్యాప్‌టాప్‌లో కోపైలట్ కీ, ఇంటెల్ AI బూస్ట్ NPU ఉన్నాయి. ఆస్పైర్ గో 14 14-అంగుళాల WUXGA డిస్‌ప్లే, అల్యూమినియం బిల్డ్‌ను కలిగి ఉంది.

భారత్‌లో Acer Aspire Go 14 ధర ఎంత? :

భారత మార్కెట్లో ఏసర్ Aspire Go 14 ధర రూ.59,999 నుంచి ప్రారంభమవుతుంది. క్లియర్ సిల్వర్ ఎండ్‌తో వస్తుంది. Acer వెబ్‌సైట్‌తో పాటు, ఈ ల్యాప్‌టాప్ ఆఫ్‌లైన్ Acer ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, Amazon ద్వారా కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. కోర్ అల్ట్రా 7 155H CPU, 32GB వరకు RAM సపోర్టు ఇచ్చే ఏసర్ Aspire Go 14 మోడల్ OLED వేరియంట్ అధికారిక ఇ-స్టోర్‌లో రూ.99,999కు అందుబాటులో ఉంది.

Read Also : Business Idea : మీ జాబ్‌కు గుడ్‌బై చెప్పేయండి.. ఈ 5 బిజినెస్‌లతో కోట్లు సంపాదించుకోవచ్చు.. తక్కువ పెట్టుబడితో కోట్ల ఆదాయం..!

Advertisement

ఏసర్ ఆస్పైర్ గో 14 ఫీచర్లు :

Acer Aspire Go 14 ల్యాప్‌టాప్ 16:10 యాస్పెక్ట్ రేషియోతో 14-అంగుళాల WUXGA IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ CPU, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్, ఇంటెల్ AI బూస్ట్ NPU ద్వారా పవర్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 32GB DDR5 RAM, 1TB PCIe Gen 3 SSD స్టోరేజ్ వరకు సపోర్టు ఇస్తుంది. విండోస్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తుంది. ఏసర్ ఆస్పైర్ గో 14లో ప్రత్యేకమైన కోపైలట్ కీ కూడా ఉంది. కొన్ని ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారులు టెక్స్ట్‌ను ఎక్‌ట్రాక్ట్ చేసేందుకు వాయిస్ ద్వారా యాక్షన్లను యాడ్ చేయొచ్చు.

ఈ ఏసర్ ల్యాప్‌టాప్‌లో ప్రైవసీ కోసం ఫిజికల్ షట్టర్ HD వెబ్‌క్యామ్ కూడా ఉంది. Acer Aspire Go 14 ల్యాప్‌టాప్ 55Wh 3-సెల్ బ్యాటరీని అందిస్తుంది. 65W USB-C అడాప్టర్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 6, బ్లూటూత్ 5.2, RJ45 పోర్ట్, రెండు USB 3.2 టైప్-A పోర్ట్‌లు, రెండు USB టైప్-C పోర్ట్‌లు ఉన్నాయి. డిస్ప్లేపోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది. మరొకటి ఛార్జింగ్ కోసం అందిస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ 1.5 కిలోల బరువు, 17.5 మిమీ మందంతో వస్తుంది.

Advertisement
Exit mobile version