19 Minute Viral Video : బిగ్ అలర్ట్.. ఏఐ ఫేక్ వీడియోలతో జాగ్రత్త.. సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతోంది. గత కొన్ని గంటలుగా ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్‌లో “19 నిమిషాల వైరల్ వీడియో” ట్రెండింగ్‌లో ఉంది.
ఒక వ్యక్తి ప్రైవేట్ లైఫ్ సంబంధించి (19 Minute Viral Video) లీక్ అయిన వీడియో అంటూ వాదనలు వస్తున్నాయి. అందరూ ఈ లింక్ కోసమే తెగ వెతికేస్తున్నారు. ఎవరూ ఈ లింక్ క్లిక్ చేయొద్దు.. అందులో ఎలాంటి లింక్ లేదు. అయినా అది క్లిక్ చేసేందుకు ప్రయత్నిస్తే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అవుతుంది జాగ్రత్త..
వేలాది మంది వినియోగదారులు (viral videos 19 minute viral video) కామెంట్స్ సెక్షన్‌లో లింక్ ప్లీజ్, ఫుల్ వీడియో లింక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ, ఈ వీడియో కోసం ఎవరూ ప్రయత్నించొద్దు. ఇది హ్యాకర్ల ట్రాప్ అంటూ సైబర్ నిపుణులు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. 90శాతం కేసుల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్రెండ్ ఫేక్, క్లిక్‌బెయిట్ అని దర్యాప్తులో తేలింది.
వైరల్ అయిన 19 నిమిషాల 34-సెకన్ల వీడియో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. డిజిటల్ ప్రపంచంలో కొత్త ప్రమాదాలను హైలైట్ చేస్తూ.. పుకార్లు, డీప్‌ఫేక్‌లతో అమాయక ఇన్ఫ్లుయెన్సర్లను లక్ష్యంగా చేసుకున్నారు. లక్షలాది మంది దీని గురించే చర్చిస్తున్నారు. కానీ, అందులో ఎవరు ఉన్నారో ఎవరికీ తెలియదు. ఈ మిస్టరీ పుకార్లకు ఆజ్యం పోసింది. చాలా మంది అమాయకులను వెలుగులోకి తెచ్చింది.
అసలేం జరిగిందంటే? :
ఇటీవల ఒక జంట 19 నిమిషాల ప్రైవేట్ వైరల్ వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం.. 19 నిమిషాల వైరల్ వీడియో ఒక జంట ఏకాంతంగా ఉన్న వీడియోకు లింక్ అయినట్టు రిపోర్టు అయింది. కొన్ని ఆన్‌లైన్ పోస్ట్‌లు హోటల్ గదిలో రికార్డు చేసిన 19 నిమిషాల, 34-సెకన్ల క్లియర్ ఫుటేజ్‌గా అభివర్ణించారు.
ఎలాంటి ఆధారాలు లేని ఈ వీడియోతో ఇన్‍స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఒక మహిళా క్రియేటర్ కామెంట్స్ సెక్షన్ ఒక్కసారిగా 19 నిమిషాల వైరల్ వీడియో పోస్ట్‌లతో నిండిపోయింది.
Read Also : Realme P4x 5G : 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి P4x 5G ఫోన్.. ధర కూడా తక్కువే..!
అంతేకాదు.. తాను వైరల్ అయిన అమ్మాయిలా కనిపించడం లేదని పేర్కొంటూ ఒక వీడియో చేసింది. వైరల్ క్లిప్‌లోని అమ్మాయి ఇంటర్ దాటి చదవకపోయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందని ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. వేరొకరి తప్పులకు తనను నిందించకూడదని ఆమె స్పష్టంగా పేర్కొంది.
19 Minute Viral Video : ఈ వీడియో AI- జనరేటెడ్ డీప్ ఫేక్ కావచ్చా? :
ఎప్పుడు ఎక్కడ చూసినా ఈ 19 నిమిషాల వైరల్ వీడియో గురించే చర్చ నడుస్తోంది. మొత్తం వీడియో వాస్తవానికి డీప్‌ఫేక్ అయి ఉండవచ్చని కొత్త సిద్ధాంతం మొదలైంది. సీజన్ 2, సీజన్ 3 పేరుతో ఏఐ రూపొందించిన వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపించడం ప్రారంభించాయి.
దాంతో మరింత అనుమానాన్ని పెంచింది. డీప్‌ఫేక్‌లు ఇప్పుడు నిజం కన్నా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, ఈ టెక్నాలజీ తప్పుడు చేతుల్లో ప్రమాదకరమని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ట్రెండ్ బేబీడాల్ ఆర్చి అనే అమ్మాయి రాత్రికి రాత్రే ఇన్‌స్టాగ్రామ్ సంచలనంగా మారిన కేసును గుర్తు చేసింది. ఆ మహిళ నిజమైనది కాదని తరువాత తేలింది. మొత్తం అకౌంట్ ఏఐ ద్వారా ఉపయోగించి క్రియేట్ చేశారు. నిజంగా మహిళ ఒక ఫోటోను ఉపయోగించి ఫేక్ ఐడెంటిటీని జనరేట్ చేశారు. ఇంతకీ తన ఫొటో దుర్వినియోగం అయిందనే విషయం బాధిత మహిళకు తెలియదని అస్సాం పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో ఏం తేలింది? అసలు ట్విస్ట్ ఇదే? :
అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఫేస్ ఏఐ మోడల్‌ను క్రియేట్ చేసిన వ్యక్తి ఒక మహిళకు మాజీ భర్త అని దర్యాప్తులో తేలింది. వారిద్దరూ విడిపోయిన తర్వాత అతను ఏఐ ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను క్రియేట్ చేశాడు. ఆ వీడియోలను పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లకు అప్‌లోడ్ (19 minute viral full video) చేయడం ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. పోలీసుల ప్రకారం.. అతడు మొదట్లోనే లక్షల రూపాయలు సంపాదించాడు. సైబర్ బృందం అతని IP అడ్రస్ ఆధారంగా అతన్ని ట్రాక్ చేసింది. అతడు వాడే డిజిటల్ డివైజ్ అన్నింటిని స్వాధీనం చేసుకుంది.
వీడియో షేర్ చేస్తే జైలుకే.. :
భారతీయ చట్టం ప్రకారం.. ఇంటర్నెట్‌లో ఏదైనా అశ్లీల లేదా ప్రైవసీకి భంగం కలిగించే వీడియోను సెర్చ్ చేయడం లేదా డౌన్‌లోడ్ చేయడం లేదా షేర్ చేయడం ఐటీ చట్టం 2000 ప్రకారం శిక్షార్హమైన నేరం. అలా చేయడం వల్ల మీరు జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. 19 నిమిషాల వీడియో వంటి కీలక పదాలతో హ్యాకర్లు తమ ఉచ్చులో పడేందుకు ఉపయోగిస్తున్నారని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల సలహా.. ఏమి చేయాలి?
- ఇలాంటి వీడియో క్లెయిమ్‌లను పట్టించుకోవద్దు.
- గుర్తుతెలియని లింక్‌లపై (ముఖ్యంగా టెలిగ్రామ్ లేదా చిన్న లింక్‌ల నుంచి వచ్చినవి) క్లిక్ చేయవద్దు.
- ఇలాంటి స్కామ్ అకౌంట్లను వెంటనే రిపోర్టు చేసి బ్లాక్ చేయండి.

