Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

India vs Pakistan T20 World Cup Highlights : భారత్ దెబ్బకు పాకిస్తాన్ చిత్తు చిత్తు, సూపర్-8కి టీమిండియా

India vs Pakistan T20 World Cup Highlights

India vs Pakistan T20 World Cup Highlights ( Image Credit source: PTI)

India vs Pakistan T20 World Cup Highlights : భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు చిత్తు.. టీమిండియా బౌలర్ల దెబ్బకు పాక్ కుదేలైంది. ఫలితంగా దయాది పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

దాంతో భారత జట్టు సూపర్ 8కి అర్హత సాధించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన బిగ్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్‌ జట్టును ఓడించి భారీ విజయాన్ని సాధించింది.

గ్రూపు Aలో భారత్ అగ్రస్థానం :
టీ20 టోర్నమెంట్ చరిత్రలో పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. ఈ విజయంతో టీమిండియా సూపర్-8కి అర్హత సాధించింది. అదే సమయంలో, గ్రూప్ Aలో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Advertisement

ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ఈ విజయంలో కీలకంగా మారింది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా తలా 2 వికెట్లు పడగొట్టారు.

Read Also : Credit Card Users : క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, ప్రతి పేమెంట్ లెక్క చెప్పాల్సిందే, పన్ను కట్టాల్సిందే!

ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Advertisement

అదే లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. కేవలం 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 19న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరుగుతుంది.

కుప్పకూలిన పాకిస్తాన్ జట్టు :
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ తొలి 2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేతులేత్తేసింది. హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్లో అకౌంట్ తెరవకుండానే సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను పెవిలియన్ పంపేశాడు.

ఆ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా రెండో ఓవర్‌లో సామ్ అయూబ్ (6 పరుగులు), సల్మాన్ ఆఘా (4 పరుగులు) ఔట్ చేశాడు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత పాక్ ఒత్తిడిలోకి పడింది. ఐదో ఓవర్‌లో అక్షర్ పటేల్ బాబర్ అజామ్‌ను 5 పరుగులకే అవుట్ చేయగా పాకిస్తాన్‌కు నాలుగో వికెట్ లభించింది.

Advertisement

భారత బౌలర్లు విధ్వంసం :
11వ ఓవర్లో అక్షర్ పటేల్ ఉస్మాన్ ఖాన్‌ను 44 పరుగులకే ఔట్ చేసి పాక్ 5వ వికెట్ ఇచ్చాడు. ఉస్మాన్, షాదాబ్ ఖాన్ మధ్య 39 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. 12వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మొహమ్మద్ నవాజ్ (4)ను అవుట్ చేయడంతో స్కోరు (78/6)కి తగ్గింది.

13వ ఓవర్లో తిలక్ వర్మ ఏడో వికెట్‌గా షాదాబ్ ఖాన్ (14)ను ఔట్ చేశాడు. వరుణ్ చక్రవర్తి 16వ ఓవర్లో ఫహీమ్ అష్రఫ్ (10), అబ్రార్ అహ్మద్‌ను ఔట్ చేసి పాకిస్తాన్ ఆశలను తుడిచిపెట్టాడు. చివరికి, 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఉస్మాన్ తారిక్‌ను ఔట్ చేయడంతో జట్టు 114 పరుగులకే చేతులేత్తేసింది. భారత్ 61 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచింది.

ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ :
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి ఓవర్‌లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి అకౌంట్ ఓపెన్ చేయకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ నడిపించి పరుగులు సాధించారు. ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Advertisement

ఇద్దరి మధ్య 46 బంతుల్లో 87 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం కుదిరింది. ఇందులో ఇషాన్ దూకుడుగా బ్యాటింగ్ చేసి మరిన్ని పరుగులతో భారీ షాట్లు సాధించాడు. అయితే, 9వ ఓవర్‌లో 88 పరుగుల స్కోరు వద్ద ఇషాన్ సామ్ అయూబ్ 40 బంతుల్లో 77 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఇషాన్ ఔట్ తర్వాత భారత జట్టు ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది.

Exit mobile version