Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Janaki Kalaganaledu: జ్ఞానాంబను మళ్ళీ అవమానించిన యోగి..జానకి ఏం చేయనుంది..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకో కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీ రామనవమి పండుగ సందర్భంగా సీతా రాముల వారి కళ్యాణం జరిపించడం కోసం జ్ఞానాంబ కుటుంబం గుడికి వెళ్తారు.

సీతారాముల కళ్యాణం జరిపించడానికి జ్ఞానాంబ దంపతులు పక్కన రామచంద్ర జానకి లు కూడా కూర్చుంటారు. ఇంకా పూజ అంతా పూర్తి అయిన తరువాత అప్పుడు జానకి పూజారి గారు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి కదా అని అనడంతో, అవును తల్లి నేను చెప్పడం మర్చిపోయాను అని అంటాడు. అప్పుడు రామచంద్ర జానకి, జ్ఞానాంబ ఆశీర్వాదం తీసుకుంటారు.

Advertisement

అప్పుడు రామచంద్ర తన తల్లి ఆశీర్వాదం తీసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటాడు. ఆ తరువాత అందరూ ఇంటికి బయలుదేరుతుండగా ఇంతలో జ్ఞానాంబా కుటుంబ సభ్యులు గుడిలో అయోధ్య ఘట్టాన్ని చూద్దాం పదా అమ్మా అని జ్ఞానంబ కుటుంబ సభ్యులు ఆమెను బ్రతిమలాడి గా అందుకు ఆమె ఓకే అని చెబుతుంది.

దీంతో అందరూ వెళ్లి గుడి లో జరుగుతున్న ఆ నాటకాన్ని చూస్తారు. ఇక అయోధ్య ఘటన ద్వారా రామచంద్ర తనకు తన తల్లి పై ఎంత ప్రేమ ఉందో ఇన్ డైరెక్టుగా చెప్పేస్తాడు. స్టేజిపై రామచంద్ర పర్ఫామెన్స్ చూసిన జ్ఞాపకం నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు జ్ఞానాంబ రామ ను బయటికి పంపినందుకు ఉంటుంది.

ఆ తరువాత జ్ఞానాంబ, బాధపడుతూ రామచంద్ర దగ్గరకు వెళుతూ ఉండగా ఇంతలో ఒక ఆవిడ అక్కడికి వచ్చి ఏమి నటిస్తున్నావు జ్ఞానాంబ అని అంటుంది. ఆమె పక్కన యోగి కూడా ఉంటాడు. నిన్ను వీళ్ళ దగ్గర నుంచి కాపాడటానికి వచ్చాను అని తన చెల్లి జానకి కి తో అంటాడు. ఆ క్రమంలో జ్ఞానాంబ పరువు తీసేట్టుగా యోగి కొన్ని మాటలు కూడా అంటాడు. అప్పుడు జానకి, యోగి పై సీరియస్ అవుతుంది.ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Exit mobile version