Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Wolf fish: రాక్షసిలా కనిపించే తోడేలు చేప గురించి మీకు తెలుసా?

Wolf fish: నదులు, మహా సముద్రాల్లో మనకు అనేక రకాల చేపలు దర్శనం ఇస్తుంటాయి. వాటిలో కొన్ని షార్క్ చేపల లాగా ప్రమాదకరమైనవి కాగా… మరికొన్ని మరికొన్ని సాధారణమైనవి ఉంటాయి. కొన్ని పాముల్లా పొడవుగా, కొన్ని పొట్టిగా.. రకరకాల రంగుల్లో అలరిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే మరింత ఎక్కువగా అరుదైన చేపలు దర్శనం ఇస్తుంటాయి.

అమెరికాలోని ఓ జాలరి వలకు కూడా ఓ అరుదైన చేప చిక్కింది. అది చేపా తోడేలా అనేంత భయంకరంగా ఉంది. అది నోరు తెరిచినప్పుడు చూస్తే మాత్రం తీవ్రంగా భయపడాల్సిందే. పెద్ద నోరు తెరిచే తనను పట్టుకున్న వాళ్లను కరిచేందుకు చాలానే ప్రయత్నించింది. అతనికి దాని సంగతి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు. మోనే యాంగ్లర్ జాకోబ్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో ఈ చేపకి సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. భారీ తోడేలు చేప అని దాన్ని నెటిజెన్లకు పరిచయం చేశాడు. పడవలో నీరు లేని చోటు కూడా ఆ చేప గింజుకుంటూ ఉంది. నోటికి ఏది దొరికితే దాన్ని కొరికేద్దామని చూస్తోంది.

Advertisement

అయితే ఇలాంటి చేపలు చాలా ప్రమాదకరమైనవని.. వాటి నోటికి చిక్కామంటే ఇక మన పని అంతే అని జాలరి చెప్పాడు. అలాగే ఇవి ఎక్కువగా వలల్లో చిక్కవని.. తమను తాము రక్షించుకోవడంలో ఈ చేపలు ఎప్పుడూ ముందుంటాయని వివరించాడు. ఈ చేపలు ఇతర చేపల్ని ఆహారంగా తినేస్తాయంట. అయితే ఓ చనిపోయిన రొయ్యను ఆ చేప నోట్లో పెట్టి మళ్లీ దాన్ని సముద్రంలోనే వదిలి పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్ ని టిక్ టాక్ లో పోస్ట్ చేయగా… 32 లక్షల వ్ూస్, 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

Advertisement
Exit mobile version