Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

SIM Cards: మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి?

SIM Cards: ప్రస్తుత కాలంలో ఒకే వ్యక్తి ఆధార్ నెంబర్ ఆధారంగా ఎన్నో రకాల సిమ్ కార్డులను తీసుకొని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులను ఉపయోగించారు? వాటిలో ఎన్ని యాక్టివ్ గా ఉన్నాయి? ఎన్ని డీయాక్టివ్ అయ్యాయి అనే విషయాలను గురించి ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు.మరి మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి టెలికం సంస్థ కొత్త ఆన్లైన్ సైట్ ను మన ముందుకు తీసుకు వచ్చింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఒక కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది. ఈ సైట్ ద్వారా మనం మన పేరు పై ఉన్న ఫోన్ నెంబర్లను తెలుసుకోవచ్చు. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ & కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) పేరుతో ఈ వెబ్సైట్ ను తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ ఆధారంగా మన పేరు పై ఉన్న సిమ్ కార్డులను కనుక్కోవచ్చు. మరి అది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం….

Want to know how many SIM cards are in your name but just do this

ముందుగా సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి. ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఓటిపి కోసం సూచించిన బాక్స్ పై క్లిక్ చేయాలి. ఇలా నొక్కగానే మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది.ఇక ఈ ఓటిపి ఎంటర్ చేయగానే మన ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు కొన్నాము… వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి.. ఎన్ని పనిచేయవు అనే విషయాలను ఈజీగా తెలుసుకోవచ్చు.

Advertisement
Exit mobile version