Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Mega marriages: మెగా ఫ్యామిలీ పెళ్లిళ్లపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. వాళ్లిద్దరి జాతకాలు ఒకటేనట

Mega marriages: మెగా డాటర్ మరో పెళ్లికి సిద్ధపడింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో వివాహం చేసుకోబోతోందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా కల్యాణ్ కు విడాకులు ఇచ్చిందని, త్వరలోనే మరో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారం నేపథ్యంలో జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాళ్ల పెళ్లిళ్లు, పెటాకులు గురించి అంచనాలు వేసి చెప్పే ఈ జ్యోతిష్కుడు… పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రీజల గురించి జాతకం చెప్పారు. ఇతను ఇప్పటికే పలు టాలీవుడ్ జంటల గురించి వారి పెళ్లి, విడాకుల తంతు గురించి ముందే ఊహించి చెప్పారు. అలా వేణు స్వామి ఫేమస్ అయ్యారు. టాలీవుడ్ లో ఏ ఇద్దరు నటీ నటులు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు రాగానే… మీడియా సంస్థలు వేణు స్వామి వద్దకు పరిగెడుతుంటాయి. వారి పెళ్లి జరుగుతుందా లేదా అని చెప్పాలని అడుగుతుంటాయి. నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకుంటారని… తర్వాత కొన్ని రోజులకు విడిపోతారని వేణు స్వామి ముందే చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్లు జరగడంతో ఆయన జోస్యంపై కొంత నమ్మకం ఏర్పడింది.

ప్రస్తుతం మెగా కూతురు శ్రీజ పెళ్లిపై వేణు స్వామి కామెంట్లు చేశారు. ఆమె జాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడని.. మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటుందని చెప్పాడు వేణు స్వామి. శ్రీజ, పవన్ కల్యాణ్ జాతకాలు ఒకే విధంగా ఉన్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement
Exit mobile version