Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu june 15 Today Episode : సాక్షికీ గట్టిగా బుద్దిచెప్పిన వసు..వసు మాటలకు ఆశ్చర్యపోయిన రిషి..?

Guppedantha Manasu june 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, రిషి ని ల్యాబ్ లో నుంచి సేఫ్ గా బయటకు తీసుకొని వస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వసు, మహేంద్ర దంపతులపై కోపంతో విరుచుకు పడుతుంది. రిషి సార్ ను అలా ఎలా లోపలికి పంపించారు అంటూ జగతి, మహేంద్ర లను నిలదీస్తుంది. అప్పుడు జగతి మరి నువ్వు ఎందుకు లోపలికి వెళ్లావు అని అడగగా వసు మౌనంగా ఉండి పోతుంది.

Guppedantha Manasu june 15 Today Episode

అప్పుడు తన మనసులో ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జగతి నువ్వు ముందు క్లారిటీ ఇవ్వు వసు ఈ ప్రశ్న రిషి కూడా అడుగుతాడు మా దగ్గర తప్పించుకున్న కూడా రిషి దగ్గర తప్పించుకోలేవు అని అంటుంది జగతి. మరొకవైపు రిషి ల్యాబ్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

అప్పుడు వసు మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు. ఈ వసుధార ఏంటో నాకు అస్సలు అర్థం కాదు అని అనుకుంటూ ఉంటాడు. ఇలా ఎందుకు చేసావు అని అడిగితే ఏవో సమాధానాలు చెబుతూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు రిషి. మరొకవైపు వసుధార కూడా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

తాను మాట్లాడిన మాటలను గుర్తుతెచ్చుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి సాక్షి వచ్చి రిషి ని కాపాడినందుకు థాంక్స్ అని చెప్పి స్వీట్ కూడా ఇస్తుంది. తన మాటలతో వసుధార కు కోపం వచ్చే విధంగా ప్రవర్తిస్తుంది సాక్షి. కానీ వసుధార మాత్రం కోప్పడకుండా నవ్వుతూ సాక్షికి తగిన బుద్ధి చెబుతుంది.

అప్పుడు వసుధార మాటలు విన్న సాక్షి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇప్పటివరకూ ఎటు అర్థం కాకుండా ఉన్న దాన్ని ఇప్పుడు మాత్రం క్లారిటీ వచ్చింది అంటూ సాక్షి తెచ్చిన స్వీట్స్ తింటూ బాగా సాక్షి కౌంటర్ వేస్తుంది. రిషి సార్ నేను అస్సలు వదలను. నువ్వు రిషి సార్ ని ఎప్పటికీ కలవవు అని అనడంతో సాక్షి కోపం తో రగిలిపోతుంది.

Advertisement

అంతేకాకుండా నీకు ఒక గిఫ్ట్ అంటూ సాక్షి ఇచ్చిన చెక్ ను తిరిగి ఇస్తుంది. ఎలా అయినా ఈ విషయం గురించి రిషి సార్ కీ చెప్పాలి అని రిషికీ మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత రిషి ని ఒక చోట కలిసి మీరు లేకుంటే నేను ఉండలేను అని ప్రేమగా మాటలు చెప్పడంతో వసుధార ఏం చెబుతుందో అర్థంకాక రిషి ఆలోచనలో పడతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also :  Guppedantha Manasu june 14 Today Episode : ఎట్టకేలకు రిషి పై ప్రేమను బయట పెట్టిన వసుధార.. మీరు లేకపోతే ప్రాణాలతో ఉండలేనంటూ?

Advertisement
Exit mobile version