Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Guppedantha Manasu : రిషిపై కోపంతో విరుచుకుపడ్డ వసు.. బాధలో జగతి..?

Guppedantha Manasu March 10 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. జగతి తో మాట్లాడాలి అని రిషి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆ ఫోన్ ని వసుధార లిఫ్ట్ చేయగా, ఏంటి మేడం ఫోన్ లిఫ్ట్ చేసావ్ అని అడగగా మేడం బాగా లేక పడుకుంది చెప్పండి సార్ అని సీరియస్ గా మాట్లాడుతుంది. నేను నీతో మాట్లాడాలి నీ మొబైల్ కాల్ చేస్తాను కదా అని రిషి అనగా నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను సార్ అని వసు అంటుంది. అప్పుడు రిషి నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి రా అని చెప్పాడు.

Guppedantha Manasu March 10 Today Episode

మరొక వైపు దేవయాని మహేంద్ర ని ఎలా అయినా బాధ పెట్టాలి అని కాఫీ తీసుకుని వెళుతుంది. కానీ మహేంద్ర ఆమెకు అల్టిమేట్ గా సాగిస్తాడు. ఆ రోజు రిపోర్టర్ మంచి పని చేశాడు. ఇకపై నేను జగతి హ్యాపీ గా ఉండవచ్చు అని అనగా దేవయాని కోపంగా ఆపు మహేంద్ర అని అంటుంది. అప్పుడు మహేంద్ర తన మనసులో నన్ను బాధ పెట్టడానికి వచ్చావ్ కదా ఇప్పుడు నీకు బాగా అయిందా అని అనుకుంటాడు. మరోవైపు రిషి చెప్పిన ప్రదేశానికి వసు వస్తుంది.

వసుధార, రిషి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావ్ ఏమైనా మాట్లాడు అని అనగా అప్పుడు వసుధార జరిగిన విషయం లో జగతి మేడం తప్పేంటి ఉంది సార్ అంటూ రిషి ఫై కోప్పడుతుంది. రిషి చేసిన పనికి కోపంతో రగిలి పోతున్న వససు పొగరుగా మాట్లాడుతుంది. రిషి కూడా వసు ఫై సీరియస్ అవుతాడు. మీ మేడం నీకు మంచిది కాబట్టి నేను ఏం పని చేసినా నీకు అలాగే కనిపిస్తుంది అని అంటాడు.

Advertisement

Guppedantha Manasu March 10 Today Episode : రిషిపై వసూ ఫైర్.. అసలేం ఏమైందంటే?

అప్పుడు నీకు ఇగో ఎక్కువ అని రిషి అనగా నాకంటే మీకు కొన్ని రెట్లు ఎక్కువ గానే ఇగో వుంది సార్ అని అంటుంది వసుధార. ఇక ఆ తర్వాత వారిద్దరు కొద్దిసేపు ఒకరిపై మరొకరు కోపంతో వాదించుకుని అక్కడినుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు గౌతమ్, జగతి ఇంటికి వస్తాడు. జగతి తో మాట్లాడుతూ ఉండగా జగతి ఫీల్ అవుతూ ఉంటుంది. గౌతమ్ ఎలా అయినా సరే మహేంద్ర, జగతిని కలపాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు.

అప్పుడు గౌతమ్ మాట్లాడుతూ.. మేడం మీరు మంచి వారు, మహేంద్ర సార్ కూడా మంచి వారు, ఈ విషయం గురించి నేను నీతో మాట్లాడుతాను అని అనగా.. అప్పుడు జగతి వద్దు అది ఒకరు చెబితే అది అబద్ధం కాదు అని చెప్పి కాపీ చేయడానికి వెళుతుంది జగతి. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Guppedantha Manasu : రిషిఫై విరుచుకుపడ్డ మహేంద్ర.. దేవయానిఫై తిరగబడ్డ వసు..?

Advertisement
Exit mobile version