AP News: గత సార్వత్రిక ఎన్నికలలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతమంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తానని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.అయితే అప్పుడు అతను చెప్పిన విధంగానే ప్రస్తుతం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయటానికి ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి పలుసార్లు చర్చించడంతో పలువురు మంత్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి వారు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ముగ్గురు పదుల కి ఎలాంటి గండం లేదని సమాచారం. ఈ ముగ్గురు మంత్రుల పదవులు అలాగే ఉంటాయని ఇతరుల అందరిని మారుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరికి పదవులు పోనున్నాయి,కొత్తగా ఎవరు మంత్రి పదవిని దక్కించుకుంటారు అనే విషయంపై వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.