Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

TS Edcet : తెలంగాణ ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటి వరకో తెలుసా?

telangana-edcet-schedule-released

telangana-edcet-schedule-released

TS Edcet : తెలంగాణలో బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్ షెడ్యూల్ ను విడుదల చేశాకు ఎడ్ సెట్ కన్వీనర్ ఎ. రామకృష్ణ. అయితే ఈ నెల 7వ తేదీ నుంచి జూన్ 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించుబోతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా దరఖాస్తులు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 చెల్లించాలని సూచించారు.

అయితే ఈ సమయంలో కట్టలేని వారు రూ.250 ఆలస్య రుసుముతో జులై 1 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో జులై 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. అయితే టీఎస్ ఎడ్ సెట్ పరీక్షను జులై 26, 27వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 220 బీఈడీ కాలేజీల్లో 19 వేల 600 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 50 శఆతం మార్కులతో డిగ్రీ, ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Read Also : Aadhar Mobile Number: ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ కు లింక్ చేశారో మర్చిపోయారా.. అయితే ఇలా తెలుసుకోండి!

Exit mobile version