Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral video: విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న టీచరమ్మ..!

Viral video: బడికి వెళ్లిన పిల్లలకు చదువు చెప్పడం, మంచి మర్యాదలు నేర్పించడం గురువుల బాధ్యత. కానీ కొందరు గురువులు మాత్రం అవన్నీ నేర్పించరు. కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేస్తుంటారు. మరికొందరేమో మంచి మంచి బుద్ధులతో పాటు చదువును కూడా నేర్పిస్తారు. ఇంకా కొందరు మహానుభావులు ఉంటారు. బడిలోని పిల్లలతో వాళ్ల పనులు కూడా చేయించుకుంటారు. అలాంటి కోవకు చెందిందే మనం ఇప్పుడు చూడబోయే వార్త.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హర్దోయి ప్రైమరీ పాఠశాలలో ఊర్మిళా సింగ్ టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె పిల్లలకు పాఠాలు చెప్పమంటే వారితో మసాజ్ చేయించుకుంటోంది. ఓ పిల్లాడు ఆమె చేతికి మసాజ్ చేస్తున్న వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఓ కుర్రాడు ఆమె చేయి నొక్కుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోసోషల్ మీడియాలో వైరల్ కాగా అధిారులు చర్యలు తీసుకున్నారు. ఆమెను సస్పెండ్ చేయడమే కాకుండా.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ టీచరమ్మ తరగతులకు వెళ్లదని.. పాఠాలు కూడా సరిగ్గా చెప్పదంటూ స్కూల్ హెడ్ మాస్టర్ తెలియజేశారు. ఈ ఘటనపై అభిప్రాయాలను కామెంట్లు రూపంలో తెలియజేయండి.

Advertisement
Advertisement
Exit mobile version