Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam April 25Today Episode : సౌర్యపై కోపంతో రగిలిపోతున్న స్వప్న..నిరూపమ్ ను నిరాశ పరిచిన జ్వాలా..?

Karthika Deepam April 25Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటు దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరూపమ్ మాటలకు జ్వాలా ఫిదా అవుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో కాఫీ షాప్ లో హిమ,ప్రేమ్ కాఫీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ప్రేమ్ ఎలా అయినా హిమకు తన ప్రేమ గురించి చెప్పాలి అని అనుకుంటు ఉంటాడు. ఎలాంటి అడ్డంకులు రాకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ లోపు అనుకోకుండా అక్కడికి జ్వాలా వస్తుంది.

Karthika Deepam

హిమ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కాఫీ నీ ప్రేమ్, హిమకు ఇస్తుండగా ఇంతలో జ్వాలా అక్కడికి వచ్చి ఆ కాపీని లాక్కొని తాగేస్తుంది. దీంతో ప్రేమ్ జ్వాలపై మండిపడతాడు. మరొక వైపు నిరూపమ్, హిమ ఫొటో చూస్తూ అమ్మ వాళ్లకు మన విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి హిమ వస్తుంది.

Advertisement

హిమ,నిరూపమ్ మాట్లాడుతూ ఉండగా ఒక పేషెంట్ ఇంజక్షన్ చేయించుకోవడానికి భయపడుతూ ఉంటుంది. అప్పుడు హిమ దైర్యంగా ఇంజక్షన్ చేస్తుంది. అప్పుడు హిమ లో వచ్చిన మార్పును చూసి నిరూపమ్ సంతోష పడతాడు. ఆ తరువాత నిరూపమ్, హిమ కారులో వెళ్తూ ఉండగా మధ్యలో వారికి జ్వాలా కనిపిస్తుంది.

ఆ తర్వాత వారు ముగ్గురూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇందులో స్వప్న చూసి జ్వాలా పై మండిపడుతుంది. ఆటో తగలబెట్టేసాను కదా అప్పుడే ఆటో ఎలా కొనుక్కుంది అని ఆలోచిస్తూ దీని సంగతి మరీ చెబుతాను అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిరూపమ్, జ్వాలా షేక్ హ్యాండ్ ఇస్తూ మన మధ్య స్వారీలు థాంక్స్ లు ఉండకూడదు అని అనడంతో జ్వాలా నిరూపమ్ భర్తగా ఊహించుకుంటూ ఉంటుంది.

మరొకవైపు ఈ మామిడి కాయలు కోయడానికి తోటలో కష్టపడుతూ ఉండగా ఇంతలో నిరూపమ్ వచ్చి హిమ ను తెచ్చుకుంటాడు. ఇక రేపటి భాగంలో సౌందర్య, సౌర్య కోసం వెతుకుతు ఒక ఆఫీస్ కి వెళుతుంది. అక్కడికి అనుకోకుండా సౌర్య కూడా వస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Exit mobile version