Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Jabardasth: జబర్దస్త్ కు సుధీర్, గెటప్ శ్రీను గుడ్ బై.. అసలు ఏం జరిగిందంటే..?

Jabardasth: జబర్దస్త్ షో గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ షో అంతగా పాపులర్ అయింది మరి. అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రోగ్రాంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి కొంత మంది వెళ్లిపోయి వేవే షోలలో పాల్గొంటున్నారు. అయితే గతంలో చాలా టీమ్స్ తో కలకలలాడే జబర్దస్త్… ఎక్స్ ట్రా జబర్దస్త్… ప్రస్తుతం కొంత మందితోనే స్కిట్ లు చేస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ టీంలో కూడా కొన్ని మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో సక్సెస్ ఫుల్ డైరెక్టరుగా పేరొందిన అనిల్ రావిపూడి గెస్టుగా వచ్చారు. ఆయనకు సుడిగాలి సుధీర్ టీం అంటే చాలా ఇష్టమట. అయితే సుధీర్, శ్రీను లేకుండా నీవొక్కడివే స్కిట్ చేయడం ఎలా ఉందంటూ ఆటో రాం ప్రసాద్ ని అడగ్గా… ఆటో ఇంజిన్ లేకుండా వచ్చిందంటూ ఆయన తెలిపారు. వీరిద్దరూ కనిపించకపోయేసరికి ఇఖ వాళ్లు ఈ షోలో కనిపిస్తారో లేదోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే వరుస సినిమాల్లో అవకాశాలు రావడంతో గెటప్ శ్రీను బజర్దస్త్ కు బై చెప్పారని… అదే దారిలో తాజాగా సుడిగాలి సుధీర్ కూడా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement
Exit mobile version