Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్ కోసం దీప వెతుకుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దీప, కార్తీక్ ఫోటో పట్టుకొని భర్త కోసం వెతుకుతూ ఉంటుంది. ఎవరు చూడలేదు అని చెప్పడంతో నిరాశ పడుతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ ఒక రెస్టారెంట్ లో జ్యూస్ తాగుతూ ఉంటాడు. రెస్టారెంట్ బయట కార్తీక్ కోసం ఒక మనిషి కాపలాగా ఉంటాడు. ఇంతలోనే దీప అక్కడికి వచ్చి కార్తీక్ కాపలాగా ఉన్న ఆ వ్యక్తికి కార్తీక్ ఫోటో చూపించి ఇతడు తెలుసా అని అడగగా చూడలేదు అనే అబద్ధం చెబుతాడు.
ఆ తర్వాత హోటల్లోకి వెళ్ళింది దీప అతన్ని చూశారా అని అడగగా ఇప్పుడే జ్యూస్ తాగి వెళ్ళాడు అని చెప్పడంతో సంతోషంతో దీప వెతుకుతుంది. కానీ కార్తీక్ కనిపించకపోయేసరికి బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఇందిరమ్మ దంపతులు సౌర్య దగ్గరికి వచ్చి సినిమాకు వెళ్దాం అని చెప్పి సినిమాకు తీసుకొని వెళ్తారు. ఆ తరువాత దీప మార్కెట్ లో కాయగూరలు కొంటూ ఉంటుంది. దీపక్ దగ్గరలోనే సౌర్య కూడా బండిపై ఏదో కొనుక్కుంటూ ఉంటుంది.
ఇంట్లోనే డాక్టర్ బాబు అటుగా వస్తాడు. ఇక డాక్టర్ బాబు అతనితో కాపులాగా ఉన్న వ్యక్తితో పోట్లాడుతూ ఉండగా అది చూసిన దీప డాక్టర్ బాబు అని దగ్గరగా వెళ్లి కార్తీక్ చేతులు పట్టుకుంటుంది. కానీ కార్తీక్ మాత్రం గుర్తుపట్టకపోవడమే కాకుండా ఎవరో అన్నట్లుగా మాట్లాడడంతో దీప బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు దీప, డాక్టర్ బాబు తో మాట్లాడుతూ ఉండగా కార్తీక్ కాపలాగా ఉన్న వ్యక్తి అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. అప్పుడు దీప కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తరువాత డాక్టర్ అన్న, దీపా ఇద్దరు జరిగిన విషయాన్ని తలచుకుని బాధపడుతూ ఉంటారు.
- Karthika Deepam : రుద్రాణి నెలబాకీ తీర్చిన వంటలక్క.. టెన్షన్లో డాక్టర్ బాబు!
- Karthika Deepam serial Sep 14 Today Episode : సరికొత్త ప్లాన్ వేసిన మోనిత.. దీపతో మోనితనే నా భార్య అని తెగేసి చెప్పిన కార్తీక్..?
- Karthika Deepam serial Sep 28 Today Episode : దీప చేసిన పనికీ హాస్పిటల్ పాలైన డాక్టర్ బాబు..కోపంతో రగిలిపోతున్న మోనిత..?
