Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam Aug 20 Today Episode : గతం మర్చిపోయిన డాక్టర్ బాబు.. ఇండియాకి చేరుకున్న సౌందర్య కుటుంబం..?

Karthika Deepam Aug 20 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప డాక్టర్ బాబు కోసం హాస్పిటల్ కి బయలుదేరుతుంది. ఈరోజు ఎపిసోడ్‌లో సౌందర్య వాళ్ళు అమెరికాకు వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత హిమ ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. మనం ఇండియాకు వెళ్లిపోదాం నానమ్మ అంటూ గోల గోల చేస్తుంది. అప్పుడు సౌందర్య ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా హిమ లేదు మనం ఇండియాకి వెళ్దాం అని అంటుంది. మరొకవైపు దీప కంగారుగా హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ బాబు గురించి ఎంక్వయిరీ చేయగా, అక్కడ ఆమె అతని భార్య వచ్చి తీసుకెళ్ళింది అని చెప్పడంతో దీప షాక్ అవుతుంది.

Soundarya and Hima return back to India in todays karthika deepam serial episode

ఆ తర్వాత నర్స్ వచ్చి డాక్టర్ బాబు పర్స్ ఇవ్వడంతో అది డాక్టర్ బాబు పర్స్ అంటూ గతంలో జరిగిన విషయాన్ని తలుచుకొని బాధతో కుమిలిపోతూ ఉంటుంది దీప. మరొకవైపు ఇంద్రమ్మ దంపతులు గుడిలో దత్తత పూజా కార్యక్రమాలు నిర్వహించి సౌర్యను దత్తత తీసుకుంటారు అప్పుడు సౌర్యకి జ్వాల అని కూడా పేరు పెడతారు. మరొకవైపు సౌందర్య కుటుంబం తిరిగి ఇండియాకు చేరుకోవడంతో హిమ చాలా సంతోష పడుతూ ఉంటుంది.

Karthika Deepam Aug 20 Today Episode : సౌర్యని దత్తత తీసుకున్న ఇంద్రమ్మ దంపతులు

అప్పుడు సౌందర్య హిమతో మొత్తానికి అనుకున్నది సాధించుకున్నావు కదా అని అంటుంది. అప్పుడు హిమ సౌర్య ని ఎలా అయినా వెతకాలి నానమ్మ అని అనగా నేను వెతుకుతాను అని అంటుంది. మరొకవైపు దీప, నన్ను కాపాడిన డాక్టర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన విషయం మొత్తం వాళ్లకు చెబుతుంది. అప్పుడు ఆ డాక్టర్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి దీపకు ధైర్యం చెబుతుంది.

Advertisement
Soundarya and Hima return back to India in todays karthika deepam serial episode

మొదట నీ భర్త బతికున్నందుకు సంతోషించు అనగా అప్పుడు దీపా నా భర్త పక్కన వేరే అమ్మాయి ఉండటానికి ఊహించుకోలేకపోతున్నాను అనడంతో, ఆమె నీ భర్తకి భార్య ఎలా అవుతుంది? ఒకవేళ హాస్పిటల్లో వాళ్ళు అసలు విషయం తెలియక పొరపాటు పడ్డారేమో అని అంటుంది. మరొకవైపు డాక్టర్ బాబు కొత్తగా ఇస్తాడు. డాక్టర్ బాబుకి కాపలాగా మనుషులు కూడా ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో, దీప కి డాక్టర్ బాబు కనిపించడంతో వెంటనే ఎమోషనల్ గా వెళ్లి హత్తుకొని ఏడుస్తుంది. అప్పుడు గతం మర్చిపోయిన డాక్టర్ బాబు ఎవరు మీరు అనడంతో దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

Read Also : Karthika Deepam Aug 19 Today Episode : డాక్టర్ బాబు ని తీసుకెళ్లిన భార్య.. బాధతో కుమిలిపోతున్న వంటలక్క..?: డాక్టర్ బాబు ని తీసుకెళ్లిన భార్య.. బాధతో కుమిలిపోతున్న వంటలక్క..?

Advertisement
Exit mobile version