Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Karthika Deepam june 20 Today Episode : సౌర్య తనకు తెలుసంటూ షాక్ ఇచ్చిన శోభ.. రక్తంతో డాక్టర్ సాబ్ బొమ్మ వేసి ప్రపోజ్ చేసిన జ్వాల?

Karthika Deepam june 20 Today Episode : బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందనే విషయానికి వస్తే.. హాస్పిటల్ లో డాక్టర్ సాబ్ జ్వాలతో మాట్లాడాలని తనని తీసుకువెళతాడు. ఆ సమయంలో హిమ నేను కూడా మీ వెంట వస్తాను అంటే జ్వాలా వద్దని చెబుతుంది. ఇన్ని రోజులు చెప్పకుండా ఆపావు ఇప్పుడేంటి ఇలా అడ్డుపడుతున్నావ్ అంటూ నిరుపమ్ వెంట వెళ్తుంది.

Karthika Deepam june 20 Today Episode

మరోవైపు సౌందర్య హిమ ప్రవర్తనకు ఆలోచనలో పడుతుంది. హిమ ఏంటి ఇలా చేస్తుందని ఆలోచిస్తుండగా అప్పుడే శోభా ఎంట్రీ ఇచ్చి మేడమ్ మీతో కొంచెం మాట్లాడాలి అని సౌందర్యతో అంటుంది. ఏంటో చెప్పు అని సౌందర్య అనగా కనిపించకుండా పోయిన మీ ఇంకో మనవరాలు ఎక్కడుందో నాకు తెలుసు అని ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ చెబుతుంది. శోభ అలా చెప్పే సరికి ఆశ్చర్యపోయిన సౌందర్య తన మనవరాలు ఎక్కడుందో చెప్పమంటూ అడుగుతుంది. నీ మనవరాలు గురించి చెబితే నాకేంటి లాభం అని శోభ అనగా నీకేం కావాలో చెప్పు ఇస్తాను అని సౌందర్య అంటుంది.

నీ మనవడు నిరుపమ్ తో నాకు పెళ్లి చెయ్యి అని షాక్ ఇస్తుంది.వెనుకనుంచి ఈ విషయాలన్నీ వింటున్న హిమ షాక్ అవుతారు . అయితే ఇన్ని రోజులు హిమ అంటూ శోభనే జ్వాలకు ఫోన్ చేసిందా అని ఆలోచనలో పడుతుంది. మరోవైపు నిరుపమ్ ను నాకు ఇచ్చి పెళ్లి చేయండి మూడుముళ్లు పడిన క్షణమే మీ మనవరాలు మీ కళ్ళ ముందుకు వస్తుంది. ఒకవేళ నాపై నమ్మకం లేకుంటే పెళ్లయిన తర్వాత మీ మనవరాలిని మీ ముందుకు తీసుకు రాకపోతే నిరుపమ్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ విడాకుల పత్రాలను కూడా చూపిస్తుంది.

Advertisement

ఇదంతా వింటున్న హిమ శోభ నానమ్మను బ్లాక్ మెయిల్ చేస్తుందా అని ఆలోచిస్తుంది. హిమ ఎలాగో నిరుపమ్ తో పెళ్లి వద్దంటుంది. నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అర్థం చేసుకోకండి మేడమ్ అంటూ శోభ అక్కడి నుంచి వెళ్తుంది. మరోవైపు జ్వాలా డాక్టర్ సాబ్ ని తీసుకొని ఒక అనాధ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ తనకు ప్రపోస్ చేయాలని ఫిక్స్ అయిన జ్వాల తన రక్తంతో డాక్టర్ సాబ్ బొమ్మ గీసి ఆ బొమ్మను తనకు చూపిస్తూ తన మనసులో ఉన్న మాటని చెబుతుంది. అది చూసి నిరుపమ్ షాక్ అవుతాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో ప్రపోజ్ చేస్తుంటారు. నేను నా స్టైల్ లో ప్రపోజ్ చేశాను.. ఈ విధంగా జ్వాల ప్రపోజ్ చేసే సరికి నిరుపమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆలోచనలో పడతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Read Also :  Karthika Deepam june 16 Today Episode : సౌందర్య ఇంట్లో హిమ, నిరుపమ్ పెళ్లి పనులు షురూ.. షాక్ లో జ్వాలా..?

Advertisement
Exit mobile version