Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

School Girl Dance : తగ్గేదేలే.. టీచర్ల ముందే సామి.. సామి పాటకు స్టెప్పులతో దుమ్ములేపింది.. వీడియో చూశారా?

School Girl Dance : పుష్ప మేనియా ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఎెక్కడ చూసినా పుష్ఫలోని పాటలే వినిపిస్తున్నాయి. చాలామంది తమ ఇంట్లో, స్కూళ్లలో జరిగే ఫంక్షన్లలోనూ పుష్ప పాటలకు డ్యాన్స్ లు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు. స్కూల్లో జరిగే ఫంక్షన్లలో విద్యార్థులు తమ టాలెంట్ ఏదో ఒకటి చూపిస్తుంటారు. అలాగే ఓ స్కూల్ విద్యార్థిని కూడా తన టీచర్ల ముందే పుష్ప పాటకు డ్యాన్స్ వేసి అందరిని ఔరా అనిపించింది.

శ్రీవల్లి రష్మీక పాట సామి సామి సాంగ్‌కు స్టెప్పులతో దుమ్ములేపింది. పుష్ప పాటలకు ఎంత క్రేజ్ పెరిగిందంటే.. సెలబ్రిటీల నుంచి సాధారణ యువతీ యువకులు కూడా తమదైన స్టయిల్లో పుష్ప పాటలకు డ్యాన్స్ లు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పుష్ప పాటలకు డ్యాన్స్ వేసిన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టగానే తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్ హిట్ కాంబినేషన్ దర్శకుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్లో వచ్చి పుష్ప మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. సినిమా ఎంత హిట్ అయిందో పాటలు కూడా అంతే స్థాయిలో ఫుల్ పాపులర్ అయ్యాయి.

School Girl Dance : School Girl Dances for Sami Sami Song from Pushpa Movie in Govt School Function

పుష్పలో ప్రతిపాట సెన్సేషన్ హిట్ సాధించాయి. అందులోనూ సమంత ఐటెం సాంగ్ చేసిన ఊ అంటావా మామ అనే పాట ప్రపంచాన్ని ఇప్పటికీ ఊపేస్తూనే ఉంది. పుష్ప ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పటినుంచి పుష్ప డైలాగ్ ల నుంచి పాటల వరకు అన్నింటిని ఎక్కడో ఒకచోట తెగ వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలామంది రష్మీక మందన సామి సామి పాటకు స్టెప్పులతో అదరగొట్టేశారు.

Advertisement

ఇప్పుడు స్కూల్ ఫంక్షన్‌లో ఓ బాలిక సామి సామీ పాటకు సూపర్ డ్యాన్స్ చేసింది. ఏకంగా అందరూ టీచర్లు చూస్తుండగానే పుష్ప సాంగ్‌కు అచ్చం రష్మీకలానే డ్యాన్స్ చేసింది. బాలిక డ్యాన్స్ చేసి టీచర్లు కూడా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. మారింది.

Read Also : Viral Video : లంగా ఓణీలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టిన అమ్మాయి.. వీడియో వైరల్..!

Advertisement
Exit mobile version